భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ ప్రాణాంతకంగా వ్యాప్తి చెందుతుంది. అయితే , కొన్ని అరుదైన ఇన్ఫెక్షన్ కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయని డాక్టర్లు ఇప్పుడు చెబుతున్నారు. కరోనా నుండి కోలుకున్న రోగులు 'బ్లాక్ ఫంగస్' భారిన ఎక్కువగా పడుతున్నారట. మ్యూకోర్ మైకోసిస్ ఒక అరుదైన ఇన్ఫెక్షన్. సాధారణంగా మట్టిలో, మొక్కల్లో, ఎరువులో కుళ్లిపోతున్న పండ్లు, కూరగాయల్లో కనిపించే మ్యూకర్ వల్ల వస్తుంది. ఇది అన్నిచోట్లా ఉంటుంది. మట్టిలో, గాల్లో, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల ముక్కులో, చీమిడిలో కూడా ఉంటుందిని వైద్యులు చెప్తున్నారు. ఇది సైనస్, మెదడు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. డయాబెటిక్ రోగులకు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే క్యాన్సర్ లేదా హెచ్ ఐ వీ లాంటివి ఉన్న రోగులకు ఇది ప్రాణాంతకం కావచ్చు.
మరణాల రేటు 50 శాతం వరకూ ఉన్న మ్యూకోర్ మైకోసిస్ కు స్టెరాయిడ్స్ ఉపయోగించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఈ చికిత్స విషమ పరిస్థితుల్లో ఉన్న కరోనా రోగుల ప్రాణాలను కాపాడగలదని చెప్తున్నారు. డయాబెటిస్ శరీరంలోని రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. కరోనావైరస్ అది మరింత తగ్గిపోయేలా చేస్తుంది. తర్వాత కరోనా తో పోరాడ్డానికి సహకరించే స్టెరాయిడ్స్ మ్యూకోర్ మైకోసిస్ కు అగ్నికి ఆజ్యంలా పనిచేస్తాయని అన్నారు. డిసెంబర్-ఫిబ్రవరి మధ్య మరో ఐదు నగరాల్లోని ఆయన ఆరుగురు కొలీగ్స్ ఇదే ఇన్ఫెక్షన్‌కు సంబంధించి 58 కేసులు వచ్చినట్లు ఓ ప్రముఖ వైద్యుడు చెప్పారు. వీరిలో ఎక్కువ మంది రోగులు కోవిడ్ నుంచి కోలుకున్నవారే. కరోనా నుంచి కోలుకున్న 12 నుంచి 15 రోజుల తర్వాత ఈ ఫంగస్ భారిన పడ్డారు.
బలహీనమైన రోగ నిరోధకవ్వస్థ ఉండి, కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నవారిలో సాధారణంగా ఈ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కనిపిస్తుంది. అయితే, షుగర్, కిడ్నీ వ్యాధులు, గుండె జబ్బులున్నవారిలో దీని ప్రభావం తీవ్రంగా ఉండొచ్చు. అదీగాక కరోనా చికిత్సలో స్టెరాయిడ్లు వాడుతుండటం, వాళ్లలో చాలా మంది డయాబెటిస్ రోగులు కూడా కావడం మళ్లీ బ్లాక్ ఫంగస్ కేసుల పెరుగుదలకు కారణం కావొచ్చు. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న కొవిడ్ రోగులకు బ్లాక్ ఫంగస్ సంక్రమించే అవకాశాలు ఎక్కువ అని డాక్టర్ స్వరూప్ వివరించారు. కరోనా నుంచి బయటపటిన తర్వాత కూడా తలనొప్పి, ముక్కులో సమస్యలు, శ్వాస సమస్యలు, కళ్లు ఎర్రగా మారి దురద పెడుతుంటే వారు వెంటనే డాక్టర్‌ని కలవాల్సి ఉంటుందని, బ్లాక్ ఫంగస్ ఒకరి నుంచి మరొకరికి సోకే ఇన్ఫెక్షన్ కాదని డాక్టర్లు చెబుతున్నారు. నియంత్రణ లేని మధుమేహం ఉన్నవారు, స్టెరాయిడ్ల వల్ల ఇమ్యూనిటీ కోల్పోయినవారు, ఐసీయూలో దీర్ఘకాలంగా చికిత్సపొందుతున్నవారు, అవయవమార్పిడి చికిత్స చేసుకొన్నవారు. మ్యూకోర్ మైకోసిస్ లక్షణాలను అలక్ష్యం చేయవద్దు. కొవిడ్ రోగుల్లో ముక్కు దిబ్బడ ఉంటే బాక్టీరియా ఇన్ఫెక్షన్ అనుకోవద్దు. వెంటనే పరీక్షలు చేసుకోవాలి. లేకపోతె కొన్ని అవయవాలు తీసేయాల్సి రావచ్చు.