కరోనా వైరస్ మహమ్మారి జన జీవనాన్ని అస్తవస్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా జోరు రోజురోజుకి పెరిగిపోతుంది. అయితే ,ఈ కరోనా వైరస్ మహమ్మారి కొత్త కొత్త జబ్బులను వెలుగులోకి తీసుకొస్తోంది. ఒకవైపు కరోనా మహమ్మారి తో నానాఅవస్థలు పడుతుంటే దానికి తోడు ఇప్పుడు బ్లాక్ ఫంగస్ మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. కరోనా వైరస్ శరీరం నుంచి ఊపిరి తిత్తులకు చేరి తీవ్రమైన ఇబ్బందులు పెడుతుంది. అయితే ఈ బ్లాక్ ఫంగస్ కేసులు ఏపీలో కూడా ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారి చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని సీఎం జగన్ ఆదేశించినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖమంత్రి ఆళ్ల నాని తెలిపారు. బ్లాక్ ఫంగస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీఎం జగన్ ఆదేశించారు. కరోనా తో తల్లిదండ్రులు చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని, ఆ పిల్లలకు ఆర్థికసహాయంపై కార్యాచరణ రూపొందించాలని అధికారులకు తెలిపారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో పకడ్బందీగా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నాం అన్నారు.
బ్లాక్ ఫంగస్ పై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశోధన చేస్తోంది. ఫంగస్ కు సంబంధించి ఎలాంటి కొత్త విషయాలు బయటపడినా రాష్ట్రాలకు సమాచారం ఇస్తోంది. ఫంగస్ సోకిన వారికి ఎలాంటి అనారోగ్య లక్షణాలుంటాయో తెలియజేస్తూ ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ ఒక పోస్టర్ విడుదల చేసింది. కళ్లు, ముక్కు ఎరుపెక్కడంతోపాటు తీవ్రంగా నొప్పి చేస్తాయి. జ్వరం, తలనొప్పి, జలుబు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు వంటి లక్షణాలు ఉంటాయి. వీటితో పాటు రక్తపు వాంతులు, మానసిక స్థితిలో మార్పులు వస్తాయి. ఇలాంటి లక్షణాలున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించడంతోపాటు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది.అయితే కోవిడ్ చికిత్సలో అధికంగా స్టెరాయిడ్ వాడటం, ఆక్సిజన్ అందించేప్పుడు స్టెరైల్ నీటికి బదులు తేమ అందించే పరికరం ద్వారా అందించడం బ్లాక్ ఫంగస్‌కు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు