తెలంగాణలో కరోనా వైరస్ తో పాటుగా బ్లాక్ ఫంగస్ కూడా వణికిపోయేలా చేస్తుంది. కరోనా వైరస్ బారిన పడి ఎక్కువ రోజులు ఆక్సిజన్ మీద ఉన్న పేషెంట్లకు బ్లాక్ ఫంగస్ వేధిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇన్ ఫెక్షన్ చికిత్సకు సంబంధించి ఆయుర్వేద వైద్యులు ఓ శుభవార్త చెప్పారు. త్వరలో బ్లాక్ ఫంగస్ కు ఆయుర్వేద చికిత్స అందబోతోంది. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో పాజిటివ్ పేషెంట్లకు, ఈఎన్ టీ ఆస్పత్రిలో పాజిటివ్ నుంచి కోలుకుని బ్లాక్ ఫంగస్ తో బాధపడుతున్న పేషెంట్లకు అల్లోపతి ట్రీట్ మెంట్ తో పాటు ఆయుర్వేద మందుల్ని కూడా ఇవ్వాలని ఆయుర్వేద కళాశాల నిర్ణయించింది. బ్లాక్ ఫంగస్ వ్యాధిని ఆయుర్వేద మందులతో నియంత్రించడం సాధ్యమేనని తెలిపారు.. తెలంగాణ ఆయుష్ విభాగం డైరెక్టర్ డాక్టర్ అలగు వర్షిణి. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ ప్రభావం తక్కువగానే ఉందని, ఇమ్యునిటీ బూస్టర్స్ ద్వారా దీన్ని నిరోధించ వచ్చని ఆమె పేర్కొన్నారు.
ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో బుధవారం ఆయుర్వేదిక్ వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో బ్లాక్ ఫంగస్ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోందని, అలాంటి ప్రమాదకర వైరస్ ను సైతం ఎదుర్కొనే శక్తి ఆయుర్వేద మందులకు ఉందని అన్నారు. ఇందుకోసం ఈ రెండు ఆస్పత్రుల్లో ప్రత్యేక వైద్యుల బృందాల్ని నియమించనున్నట్లు డాక్టర్ అళగు వర్షిణి తెలిపారు. బ్లాక్ ఫంగస్ బారినపడిన పేషెంట్లలో బ్లడ్ షుగర్ లెవల్ లో తేడాలు ఉంటున్నట్లు వైద్యులు గుర్తించారని, దీన్ని అదుపులోకి తేవడానికి ఆయుర్వేద మందులు ఉపయోగపడతాయని వివరించారు. ఒకవైపు అల్లోపతి చికిత్స కొనసాగుతుండగానే ఆయుర్వేద వైద్య చికిత్సలను కూడా అందించనున్నట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రుల్లో ఈ మందుల్ని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. స్టెరాయిడ్స్ తీసుకున్న వారందరికీ బ్లాక్ ఫంగస్ రాదని, మధుమేహ రోగులు, ఎక్కువకాలం పాటు స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్లపై మాత్రమే బ్లాక్ ఫంగస్ ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పారు. ఆయుర్వేదిక్ మందులు వాడితే నష్టం తగ్గుతుందన్నారు. ఇప్పటికే చాలామంది ఈఎన్ టీ అస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ప్రభుత్వం అక్కడ ఆయుర్వేద మందులనే రోగులకు అందిస్తోందని తెలిపారు. వాంతులు, విరోచనాలు అయినప్పుడు కొంత సమయం ఏమీ తినకుండా జావ, ఇతర ద్రవాలు తీసుకొంటూ కొద్దిగా శక్తి వచ్చిన తర్వాత పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించడం వల్లబ్లాక్‌ఫంగస్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని పేర్కొన్నారు.