అపరిశుభ్ర మాస్కులతో బ్లాక్​ఫంగస్​.. జర పైలం..!

Update: 2021-05-23 03:30 GMT
కరోనా ఎఫెక్ట్​ తో మాస్కు మన జీవితంలో భాగమైపోయింది. మాస్క్ లేకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు కూడా జనం భయపడుతున్నారు. కరోనా ఫస్ట్  వేవ్​ టైంలో ఒక్కమాస్కు పెట్టుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పేవారు. కానీ ఇప్పుడు మాత్రం వైరస్ తీవ్రత పెరగడంతో  డబుల్​ మాస్కు తప్పనిసరి అని సూచిస్తున్నారు. అంతేకాక ఎన్​-95 లాంటి మాస్కులు వాడటం మరీ  ఉత్తమం అని సూచిస్తున్నారు. దీంతో ప్రజల్లోనూ మాస్కులపై అవగాహన వచ్చింది. మాస్కులు లేకుండా ఎవరూ బయటకు రావడం లేదు.

అయితే ఈ మాస్కులను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకున్న తర్వాత మాత్రమే వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అపరిశుభ్ర మాస్కులు వాడితే బ్లాక్  ఫంగస్​ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. చాలా మంది మాస్కులను వాష్ చేసుకోకుండా మళ్లీ మళ్లీ వాటినే వాడుతున్నారు. ఇది ఎంతో ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

బ్లాక్​ఫంగస్​ వ్యాధికి అపరిశుభ్ర మాస్కులు వాడటం కూడా ఓ కారణం కావచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.కరోనా నుంచి కోలుకున్న వారికి ఇటీవల మ్యుకోరోమైకోసిస్​ లేదా బ్లాక్​ఫంగస్​ వస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్​ ఫంగస్​ తో  చాలా మంది చనిపోతున్నారు కూడా.. అయితే ఇందుకు కారణం అపరిశుభ్ర మాస్కులు అని డాక్టర్లు అంటున్నారు.


కరోనా వచ్చిన బాధితులు స్టెరాయిడ్స్​ వాడటం కూడా బ్లాక్​ ఫంగస్​ రావడానికి ఓ కారణం. ముఖ్యంగా మధుమేహం, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నవాళ్లు కరోనా చికిత్స తీసుకున్నప్పుడు వారిలో బ్లాక్​ఫంగస్​ ఎక్కువగా కనిపించింది. దీంతో బ్లాక్​ఫంగస్​ పై వైద్య నిపుణులు  పరిశోధనలు చేస్తున్నారు. మొదట్లో ఉత్తరాదికి  మాత్రమే పరిమితమైన బ్లాక్​ఫంగస్​ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు చేరింది. ఏపీలో అయితే బ్లాక్ ఫంగస్ కేసులు  ప్రతి జిల్లాలోనూ నమోదవుతున్నాయి. అయితే అపరిశుభ్ర మాస్క్ లు ధరించి బ్లాక్ ​ ఫంగస్​  బారిన పడొద్దని వైద్య నిపుణులు  హెచ్చరిస్తున్నారు.
Tags:    

Similar News