తల్లి లాంటి ఉల్లితో.. నోరూరించే చికెన్ తో బ్లాక్ ఫంగస్?

Update: 2021-05-30 10:30 GMT
ఇటీవల ఒక ప్రముఖ న్యూస్ వెబ్ సైట్ పేరు మీద వైరల్ అవుతున్న పోస్టులు కొత్త భయాన్ని పుట్టిస్తున్నాయి. సదరు పోస్టు సారాంశం ఏమంంటే.. చికెన్ ద్వారా.. ఉల్లి ద్వారా బ్లాక్ ఫంగస్ సోకుతుందని. ఈ మాటలో నిజం ఎంత? అన్నది చూస్తే.. ఇలాంటివన్నీ ఉత్త అబద్ధాలుగా చెప్పక తప్పదు. బ్లాక్ ఫంగస్ కోళ్లకు వస్తుందని కానీ.. ఆ కోళ్ల ద్వారా.. వాటి చికెన్ ద్వారా మనుషుల్లోకి వ్యాపిస్తుందన్న వాదనలో నిజం లేదని తేల్చి చెబుతున్నారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సీనియర్ సైంటిస్టు డాక్టర్ అపర్ణ ముఖర్జీ.

బ్లాక్ ఫంగస్ అన్నది అసలు అంటు వ్యాధి కాదని.. అలాంటప్పుడు జంతువులు.. మనుషులతో ఒకరి ద్వారా మరొకరికి అంటుకుంటుందన్న వాదనలు నిజం లేదని స్పష్టం చేస్తున్నారు. కాబట్టి చికెన్ తినే విషయంలో భయపడాల్సిన అవసరం లేదని.. దానికి బ్లాక్ ఫంగస్ కు ఏ మాత్రం సంబంధం లేదంటున్నారు. ఒకవేళ ఏదైనా ఫంగస్ కోళ్లకు సోకితే.. వాటి నుంచి భయంకరమైన దుర్వాసన వస్తుందని.. ఆ విషయాన్ని ఇట్టే గుర్తించొచ్చని చెబుతున్నారు. ఇప్పటివరకు జంతువులకు బ్లాక్ ఫంగస్ సోకిన కేసులు నిర్దారణ కాలేదని తేల్చారు.

కోళ్ల విషయం ఇలా ఉంటే.. తల్లి లాంటి ఉల్లితోనూ బ్లాక్ ఫంగస్ వ్యాపిస్తుందన్న ప్రచారం ఈ మధ్యన ఎక్కువైంది. ఫ్రిజ్ లో నల్లగా పేరుకుపోయిన ఫంగస్ వల్ల కూడా బ్లాక్ ఫంగస్ సోకుతుందన్న వాదన వినిపిస్తోంది. అయితే.. ఇందులోనూ నిజం లేదని చెబుతున్నారు. కాకుంటే.. ఉల్లిలో కనిపించే నలుపును శుభ్రంగా కడుక్కొని తింటే సరిపోతుందని.. లేదంటే.. ఆ తోలును తీసేస్తే సరిపోతుందని చెబుతున్నారు. వాట్సాప్ లోనూ.. సోషల్ మీడియాలోనూ సర్క్యులేట్ అయ్యే ప్రతి మెసేజ్ ను గుడ్డిగా నమ్మే కంటే.. జాగ్రత్తగా చెక్ చేసుకోవటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News