మోదీ విదేశాల నుంచి వెనక్కి తెప్పించిన బ్లాక్‌మనీ ఆయనొక్కరి అకౌంట్లోనే వేస్తున్నారట
ఇండియాలోని అక్రమార్కులు విదేశాల్లో దాచిన బ్లాక్‌మనీని వెనక్కు తెప్పించి పేదల ఖాతాలో వేస్తానన్న ప్రధాని మోదీ ఇప్పటివరకు ఎవరి ఖాతాల్లో వేయలేదని విపక్షాలు నిత్యం విమర్శిస్తుంటాయి. అయితే, మధ్యప్రదేశ్‌కు చెందిన హుకుం సింగ్ అనే వ్యక్తి ఖాతాలో మాత్రం మోదీ నిత్యం డబ్బులేస్తున్నారట.. మోదీ వేస్తున్న డబ్బులను ఆ వ్యక్తి వాడుకుంటున్నారట.
మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలోని రురై గ్రామానికి చెందిన హుకుమ్‌సింగ్, రోనీ గ్రామానికి చెందిన హుకుమ్‌సింగ్‌లు ఇద్దరూ భారతీయ స్టేట్‌బ్యాంకుకు చెందిన ఒకే శాఖలో ఖాతా తెరిచారు. ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో బ్యాంకు అధికారులు పొరపాటున ఇద్దరికీ ఒకటే ఖాతా నంబరు కేటాయించారు. అయితే.. వారిలో ఓ హుకుం సింగ్ తన అకౌంట్లో నెలనెలా డబ్బులేస్తుంటే అవి రెండో హుకుం సింగ్ అకౌంట్లో పడుతున్నాయి. వాటిని ఆయన దర్జాగా వాడుకుంటున్నాడు. తన ఖాతాలోకి వస్తున్న డబ్బును చూసి రెండో హుకుమ్ సింగ్.. 2014 ఎన్నికల్లో మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారని సంబరపడ్డాడు. ఎప్పటికప్పుడు ఆ డబ్బులు తీసుకుని తన అవసరాలకు ఉపయోగించుకున్నాడు. అలా ఆరు నెలల కాలంలో మొత్తం 89 వేల రూపాయలు డ్రా చేసుకున్నాడు.
ఇటీవల డబ్బులు అవసరమైన అసలు హుకుమ్‌సింగ్ డబ్బులు డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్లగా, అందులో రూ.35 వేలు మాత్రమే ఉండడంతో లబోదిబోమంటూ అధికారులను ఆశ్రయించాడు. అప్పటికి గానీ చేసిన పొరపాటును అధికారులు గుర్తించలేకపోయారు. తప్పును గుర్తించిన అధికారులు డబ్బులు వాడుకున్న హుకుమ్‌సింగ్‌ను పిలిచి అసలు విషయం చెప్పి డబ్బుల కోసం ప్రశ్నించారు. దీంతో తనకేమీ తెలియదని చెప్పాడు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తానని మోదీ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశాడు. అందులో భాగంగానే డబ్బులు పడుతున్నాయని భావించి వాడుకుంటున్నానని చెప్పాడు.