డబ్బున్నవాళ్లను ముగ్గులోకి దించి.. వీడియోలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ రూ. లక్షలు వసూలు చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఓ యువతి, మరో నలుగురు యువకులు ముఠాగా ఏర్పడ్డారు. ధనవంతులను పరిచయం చేసుకొని.. వారికి ఫోన్చేస్తున్నారు. తర్వాత యువతి వారితో స్వీట్‌గా మాట్లాడుతూ మత్తులోకి దించుతుంది. సెమీ న్యూడ్‌గా సదరు యువతకి వీడియో కాల్ చేస్తూ వారిని రెచ్చగొడుతుంది. అనంతరం ముగ్గులోకి దించి తమ వెంట రహస్య ప్రదేశానికి తీసుకెళ్తుంది. అనంతరం ముఠా సభ్యులు ఫోన్సంభాషణలు, యువతితో గడిపిన పర్సనల్ దృశ్యాలను రికార్డ్ చేస్తారు. వాటితో బ్లాక్‌మెయిలింగ్ చేసి భారీగా డబ్బులు గుంజుతున్నారు. ఇటువంటి ఓ ముఠాను రాజస్థాన్ ప్రభుత్వం అదుపులోకి తీసుకున్నది. వారిని విచారించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి చూశాయి.
రాజస్థాన్ రాజధాని జైపూర్ కేంద్రంగా ఈ రాకెట్ తమ కార్యకలపాలను కొనసాగించింది. మొత్తం ఐదుగురు మహిళలను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట పరువు పోతుందని భయపడి ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అడిగినంతా డబ్బు ఇచ్చి కామ్‌గా ఉన్నారు. కానీ ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ రాకెట్ గుట్టురట్టయ్యింది. నిందితుల దగ్గరి నుంచి శివదాస్ పుర పోలీసులు రూ. లక్ష నగదు, దేశీయంగా తయారు చేసిన పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ధనవంతులు, ప్రముఖులను టార్గెట్ చేసే వారని పోలీసులు తెలిపారు. సోషల్‌మీడియాలో వీడియోలు పెడతామంటూ మోసగించి డబ్బులు వసూలు చేశారని చెప్పారు. హనీట్రాప్ ముఠాపై అనేక ఫిర్యాదులు వచ్చాయని, పోలీసు కమిషనర్ మనోజ్ చౌదరి తెలిపారు. దౌసా జిల్లాలోని లాల్సోట్ లోని సావాసా గ్రామంలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఇటువంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.