అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్ తగలింది. ఆరు ముస్లిం దేశాల పౌరులు అమెరికాలో అడుగుపెట్టనివ్వకుండా ట్రంప్ తీసుకొచ్చిన ఉత్తర్వులకు మరో బ్రేక్ పడింది. వర్జీనియా రాష్ట్రంలోని ఫోర్త్ సర్క్యూట్ అప్పీల్ కోర్టు ట్రంప్ ఫర్మానాపై నిషేధాన్ని సమర్థిస్తూ తీర్పునిచ్చింది. ఇప్పటికే పలు అప్పీల్ కోర్టులు ట్రంప్ ఫర్మానాను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.
దేశ భద్రత దృష్ట్యా ఆరు దేశాల ప్రయాణికులపై నిషేధం విధిస్తున్నట్టు ఫర్మానాలో పేర్కొనడాన్ని అప్పీల్ కోర్టు తప్పుబట్టింది. అమెరికాలోకి ముస్లింలు రాకుండా నిషేధిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ.. ఈ ఫర్మానా పరోక్షంగా ముస్లింలపై నిషేధాన్ని సూచిస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది. ఈ వ్యాజ్యంపై విచారించేందుకు గత 25 ఏళ్లలో మొదటిసారిగా ఫుల్‌బెంచ్ ఏర్పాటయ్యింది. కోర్టులో మొత్తం 15 మంది జడ్జీలు ఉండగా 13 మంది వాదనలు విన్నారు. వీరిలో 10 మంది ట్రంప్ ఫర్మానాను వ్యతిరేకించగా, ముగ్గురు అనుకూలంగా ఓటేశారు. ఈ మేరకు చీఫ్ జడ్జి రోజర్ గ్రెగొరీ తుదితీర్పునిచ్చారు. ``అమెరికా అధ్యక్షుడికి గ్రహాంతరవాసులపైనా నిషేధం విధించగలిగే విస్తృత అధికారాలను అమెరికా పార్లమెంట్ కట్టబెట్టింది. కానీ ఆయన రూపొందించిన ఒక ఆదేశం ద్వారా దేశ ప్రజలకు ముప్పు ఏర్పడితే సమీక్షించక తప్పదు`` అని పేర్కొన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/