దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసి రోడ్లన్నీ కాలువలను తలపించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం సామాన్యులను ఎంతగా సతాయించిందో..మాన్యులను సైతం అంతే ఇబ్బంది పెట్టింది. అమెరికా హోంమంత్రి జాన్ కెర్రీ అయితే ఏకంగా ఈ వర్షాలు-వరదలపై సెటైర్ వేశారు. భారతదేశ పర్యటనలో ఉన్న కెర్రీ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) లో ప్రసంగించేందుకు వచ్చి విద్యార్థులు - వరదలపై పంచ్ వేస్తూ..తాజా వరదలు చూస్తుంటే పడవల్లో వచ్చారేమోనని అన్నారు.
తన ప్రసంగం ప్రారంభించడానికి ముందు దారిలో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయిన చోట కెర్రీ ఫొటోలు దిగారు. అనంతరం ఐఐటిలో ప్రసంగించడానికి వచ్చారు. ఈ సందర్భంగా జాన్ కెర్రీ మాట్లాడుతూ విద్యార్థులు పడవల్లో కాని, నీళ్లలోనూ, నేలమీద నడిచే వాహనాల్లో కాని వచ్చి ఉంటారని అనడంతో సభలో నవ్వులు పూశాయి. కుండపోతగా కురిసిన వర్షం వల్ల రోడ్లపై మోకాలి లోతు నీళ్లు నిలిచిపోవడంతో జాన్ కెర్రీ సభకు రావడం ఆలస్యమైంది. ఇదిలా ఉండగా కెర్రీకి ముందు రోజు సైతం ఢిల్లీలో మరో చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీ విమానశ్రయం దిగిన తర్వాత ఆయనకు వసతి ఏర్పాట్లు చేసిన తాజ్ హోటల్ కు చేరే వరకు తీవ్రమైన ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. అసలే ట్రాఫిక్ జాం, పైగా వర్షం ఉండటంతో పోలీసులకు వాహనాలను సమన్వయం చేయడం తలకు మించిన భారంగా మారిపోయింది. ఈ పరిణామంపై అమెరికా మీడియా కూడా స్పందించి హరీబుల్ ట్రాఫిక్ అంటూ ట్వీట్లు చేసింది. మొత్తంగా ఓ గంటపాటు కెర్రీ భారత ట్రాఫిక్ మజాను రుచి చూడాల్సి వచ్చింది.