కూతురిని రేప్ చేసిన ఎంపీ..తండ్రి ఏంచేసాడంటే..?

Update: 2019-12-09 12:59 GMT
సాధారణంగా తన కూతురిపై ఎవరైనా అఘాయిత్యం చేసిన  - అఘాయిత్యానికి పాల్పడిన కూడా తండ్రివారి పై పట్టరాని కోపం ఊగిపోయి వారిని చంపేస్తా అంటూ కోపంతో ఊగిపోతారు. ఎదుట ఉన్నది ఎవరైనా కూడా క్షణం కూడా ఆలోచించకుండా ముందుకు వెళ్తారు. కానీ , ఒక కూతురు తన పై ఒక కామాంధుడు మూడు సార్లు అఘాయిత్యం చేసాడు నాన్న అని చెప్తే ..నా పదవికి - పరువుకు సంబంధించిన సమస్య దీన్ని నువ్వు ఎవరికీ చెప్పకుండా దాచేయి అని చెప్పాడు. అసలు సమాజంలో ఇలాంటి తండ్రులు  కూడా ఉంటారా అంటే .. ఈ సంఘటన గురించి తెలుసుకుంటే ఉంటారనే చెప్పాలి. ఎక్కడ మరొక ముఖ్య విషయం ఏమిటంటే .. రేప్ కి గురికాబడ్డ అమ్మాయి సాక్ష్యాత్ ఒక దేశ ప్రధాని కూతురు. రేప్ కి పాల్పడ్డ ఆ నిందుతుడు ..ఒక ఎంపీ. అసలు ఆ ఎంపీ ఎవరు ? కూతురి రేప్ ను కూడా పదవి కోసం దాచేయమన్న ఆ ప్రధాని ఎవరు ? పూర్తి వివరాలు చూద్దాం..

ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి బాబ్ హాక్ కుమార్తె రోసలిన్ డిలాన్.. 1980లలో తనపై ఒక ఎంపీ అత్యాచారం చేశాడని. ఆ విషయాన్ని తన తండ్రికి చెప్తే - ఆ విషయం ఎవరికీ చెప్పకుండా దాచేయాలని తనకు సూచించాడని చెప్పారు. ఈ రేప్ విషయంపై నువ్వు నోరు తెరిస్తే - నా కెరీర్ పాడవుతుందని చెప్పారంట.  బాబ్ హాక్‌ కు చెందిన లేబర్ పార్టీలో ఒక ఎంపీ అయిన బిల్ లాండర్యూ కార్యాలయంలో పనిచేస్తున్నపుడు.. ఆయన తన మీద అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె చెప్తున్నారు. ఆ సమయంలో బాబ్ హాక్ లేబర్ పార్టీకి నాయకుడు అయ్యే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పారు. కానీ , ప్రస్తుతం  బాబ్ హాక్ - బిల్ లాండర్యూ ఇప్పుడు సజీవంగా లేరు. ఈ ఘటనపై ఆమె మాట్లాడుతూ .. 1983లో తన మీద మూడు సార్లు లైంగికంగా దాడి జరిగిందని తెలిపారు.

మూడోసారి అత్యాచారం జరిగిన తర్వాత.. ఈ విషయం తన తండ్రికి వెల్లడించి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పానని ఆమె తెలిపారు. దానికి ఆయన స్పందిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేయొద్దు. ఇప్పుడు నాకు ఎటువంటి వివాదాలు  వద్దు. నన్ను క్షమించు.  నేను ఇప్పుడు లేబర్ పార్టీ నాయకత్వం కోసం పోటీ చేస్తున్నాను. ఈ సమయంలో ఈ వివాదం అంత మంచిది కాదు అని చెప్పినట్లు ఆమె తెలిపింది.  అలాగే ఈ సంఘటన గురించి తమ కుటుంబానికి తెలుసునని రోసలిన్ డిలాన్ సోదరి.. సూ పీటర్స్ హాక్  చెప్పారు.

ఆమె పై అఘాయిత్యం చేసిన ఆ ఎంపీ మరెవరో కాదు .. ఆస్ట్రేలియా కేంద్ర ప్రభుత్వ మాజీ అధికారి బిల్ లాండర్యూ. ఈయన 1976 నుంచి 1992 వరకూ ఎంపీగా ఉన్నారు. బాబ్ హాక్ ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం.. బిల్, బాబ్ ఇద్దరి మధ్యా మంచి సంబంధాలు ఉన్నాయని చెప్తారు. 1980లలో ఆస్ట్రేలియా రాజకీయాల్లో బాబ్ హాక్ అగ్రగణ్యుడిగా ఉండేవారు. వరుసగా నాలుగు సార్లు సాధారణ ఎన్నికల్లో గెలిచారు. దేశంలో ఎన్నో విప్లవాత్మక ఆర్థిక, సామాజిక మార్పులు తెచ్చారు. ఆయనకి  అతిసాధారణమైన వ్యక్తిగా - అతిగా బీరు తాగే వ్యక్తిగా పేరుంది.
Tags:    

Similar News