బాబీ జిందాల్.. భారతీయ మూలాలున్న ఎన్నారై. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న బాబీ జిందాల్ అమెరికా రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
అమెరికా ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల కోసం ఆయా పార్టీల్లో అంతర్గతంగా పోటీ జరుగుతుంది. ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ నుంచి 11 మంది అభ్యర్థులు ప్రెసిడెంట్ పదవి కోసం పోటీపడుతున్నారు. జిందాల్ తో పాటు అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ సోదరుడు జెబ్ బుష్, హెచ్ పీ సంస్థ మాజీ సీఈవో కార్లీ ఫియారీనా, 2008లో అధ్యక్ష స్థానం కోసం పోటీచేసి ఓడిపోయిన మైక్ హుక్కాబీ ఉన్నారు.
లూసియానా గవర్నర్ గా సమర్థంగా పనిచేయడంతో పాటు,
అమెరికా రాజకీయాల్లో వివాదరహితుడైన నాయకుడిగా పేరున్న బాబీ జిందాల్ కే మెజార్టీ నాయకులు మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో పాటు రిపబ్లికన్ గవర్నర్ల అసోసియేషన్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. దీంతోపాటు ఒబామాను వ్యతిరేకించే వారిలో జిందాల్ ముందుంటారనే పేరుంది.