కృష్ణా జిల్లా పెనమలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019లో టీడీపీ ఓటమికి నాలుగే ప్రధాన కారణాలుగా నిలిచాయన్నారు. జగన్ సీఎంగా ఒక్క చాన్స్ ఇవ్వండి అనే నినాదం, జనసేన పార్టీ విడిగా పోటీ చేయడం, వైసీపీ నేతలు భారీగా డబ్బు ఖర్చు పెట్టడం, టీడీపీ నేతలను నియంత్రించడం వంటి నాలుగు కారణాలతోనే 2019లో టీడీపీ ఓటమి పాలయ్యిందని బోడె ప్రసాద్ వ్యాఖ్యానించారు.
కాగా ప్రస్తుతం పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తెలివైన వారని బోడె ప్రసాద్ చెప్పారు. ఆయన కొలుసు పార్థసారథి కాదని.. కాసుల పార్థసారధి అని ఎద్దేవా చేశారు. చేతిలో కాసులు పడనిదే ఏ పని జరగదని ఆరోపించారు. తాను పార్టీ మారుతున్నట్టు.. టీడీపీలో చేరుతున్నట్టు పార్థసారథి లీకులు ఇస్తారని తెలిపారు. తద్వారా పెనమలూరులో అత్యధికంగా ఉన్న ఒక సామాజికవర్గంలో ఆయనపైన అసంతృప్తి రాకుండా చూసుకుంటారన్నారు. ఇక ఎన్నికల నాటికి ఆయన ఉండాలనుకుంటున్న పార్టీలోనే ఉంటారని వెల్లడించారు.
పార్థసారథి టీడీపీలో చేరాలనుకుంటే తనకేం అభ్యంతరం లేదని బోడె ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కాల్ మనీ, సెక్స్ రాకెట్‌లో ఉన్నానని అసత్య ఆరోపణలు చేశారని.. అందుకే గత ఎన్నికల్లో ఓడిపోయానన్నారు. నిజంగా తాను చెప్పి చేసి ఉంటే సిట్ విచారణ వేసేవారని తెలిపారు. అయితే తనపై ఉన్న ఆరోపణలన్నీ అబద్ధాలే కాబట్టి ఏ విచారణ తనపై వేయలేదని బోడె ప్రసాద్ వెల్లడించారు.
తాను, వల్లభనేని వంశీ, బొండా ఉమా ముగ్గురం టీడీపీలో బాగా స్నేహంగా ఉండేవాళ్లమని చెప్పారు. నారా లోకేష్ పై వల్లభనేని వంశీ చేసిన ఆ ఒక్క తప్పుడు మాట తనకు నచ్చలేదని.. ఇదే విషయాన్ని వల్లభనేని వంశీకి మెసేజ్ చేశానని తెలిపారు. చంద్రబాబు కుటుంబంపై విమర్శలు చేసే అర్హత ఎవరికీ లేదన్నారు. వల్లభనేని వంశీ టీడీపీ నుంచి బయటకు వెళ్లిపోయాక ఆయనతో పెద్దగా టచ్ లో లేనని బోడె ప్రసాద్ వివరించారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతోందని బోడె ప్రసాద్ తేల్చిచెప్పారు. ప్రజలు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఒక కసితో ఎదురుచూస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని వైసీపీ భావిస్తే అంతకన్నా అమాయకత్వం లేదన్నారు.
విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడం వంటి వాటిపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.