పైన ఉన్న ఫొటో చూడండి. ఆ పసికందు ఇసుక తిన్నెలపై ఆదమరిచి నిద్ర పోతున్నట్లే ఉంది. కానీ ఆ పిల్లాడు ఉన్నది శాశ్వత నిద్రలో అని తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లు రాకమానవు. మరి ఆ ఉగ్రవాద రాక్షసుల మనసు మాత్రం కరుగుతుందో లేదో తెలియదు. ఇది ఉగ్రవాద భూతానికి బలైన చిన్నారి మృతదేహం. ప్రపంచమంతా ఇప్పుడా ఫొటో చూసి కన్నీరు కారుస్తోంది. టర్కీ బీచ్ లో కనిపించిన ఈ చిన్నారి మృతదేహం ఉగ్రవాదుల ఆకృత్యాలను కళ్కు కడుతోంది. కొన్ని రోజులుగా సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదాలు మారణ కాండ సాగిస్తున్నారు. దీంతో చాలామంది సిరియాను వదిలి వేరే ప్రాంతాలకు, దేశాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు.
అలా ఓ మహిళ తన ఊరు విడిచి వెళ్లిపోతుండగా ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. గ్రీకు దీవులను చేరుకోవాలని ఆత్రతంగా సముద్ర ప్రయాణం చేస్తున్న వారిపై బాంబుల వర్షం కురిపించారు. ఆ దాడిలో తల్లిదండ్రులు ఏమయ్యారో తెలియదు కానీ.. ఈ చిన్నారి మాత్రం ప్రాణాలు వదిలాడు. సముద్రం మీది నుంచి కొట్టుకుని వచ్చిన ఈ చిన్నారి మృతదేహం టర్కీలోని ఓ బీచ్ కు చేరింది. ఈ దృశ్యాల్ని ఎవరో ఫొటో తీశారు. ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ పిల్లాడి పేరు కుర్ది అని తెలిసింది. హృదయవిదారకంగా అనిపిస్తున్న ఈ ఫొటో చూసి నెటిజన్లు కదిలిపోతున్నారు. సిరియాలో మారణకాండ సాగిస్తున్న ఉగ్రవాదులు ఈ ఫొటో చూసి ఎలా స్పందిస్తున్నారో మరి.