చంకలో చెమట పట్టొద్దని అలా చేసి.. ప్రాణాలే కోల్పోయిన లేడీ బాడీ బిల్డర్!
తాము వెరీ వెరీ స్పెషల్ అనిపించుకునేందుకు.. గొప్పలు చెప్పుకునేందుకు.. జనాలు అడ్డగోలు పనులు చేయడానికైనా సిద్ధపడతారు. కొన్ని పనులు నవ్వుపాలైతే.. మరికొన్ని అత్యంత ప్రమాదకరంగా మారుతాయి. ఇదే కోవలో వింత ప్రయోగం ఒకటి చేసి.. ఏకంగా ప్రాణాలే పోగొట్టుకుంది లేడీ బాడీ బిల్డర్.
ఒడాలిస్ శాంటోస్ మెనా అనే బాడీ బిల్డర్.. మెక్సికోలోని గ్వాదలాజరాలో ఉన్న స్కిల్ పీల్ క్లినిక్ లో చెమట పట్టకుండా ఉండేందుకు చికిత్స తీసుకుంది మెనా. ఈ ట్రీట్మెంట్ ను యాంటీ పెర్స్పిరాంట్ అంటారు. ఈ చికిత్సనే మిరాడ్రీ ట్రీట్మెంట్ అని కూడా అంటారు. ఈ చికిత్సలో భాగంగా చెమట గ్రంథులను హీట్ ఎనర్జీ టెక్నిక్ తో ఆపరేట్ చేస్తారు.
ఈ చికిత్స పూర్తయితే.. ఇది చేసుకున్న వాళ్లకు చంకలో చెమట రాదు. అంతేకాదు.. అక్కడ నుంచి దుర్వాసన కూడా రాదు. అదేవిధంగా హెయిర్ కూడా పెరగదు. ఈ ట్రీట్మెంట్ చాలా సురక్షితమైనదని, ఎంతో ఎఫెక్టివ్ గా ఉంటుందని చెప్పడం వల్లే.. మెనా ఈ చికిత్సకు సిద్ధపడినట్టుగా చెబుతున్నారు.
ఈ ట్రీట్మెంట్ లో భాగంగా.. ఆమెకు ఆపరేషన్ చేయాల్సి ఉంది. వైద్యులు అంతా సిద్ధం చేశారు. చికిత్సలో భాగంగా ముందుగా మెనాకు అనస్తీషియా ఇచ్చారు. అనస్తీషియా అంటే మత్తు మందు. ఇది ఇచ్చిన తర్వాత మత్తు పనిచేయడం మొదలవుతుంది. ఆ తర్వాతే మేజర్ సర్జరీలు చేస్తారు.
అయితే.. ఈ మత్తు మందు ఇచ్చిన కాసేపటికే మెనాకు గుండె పోటు వచ్చింది. ఆ వెంటనే కాసేపటికే చనిపోయిందట. వైద్యులు ఆమెను బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. ఒడాలిస్ శాంటోస్ మెనా వయసు కేవలం 23 సంవత్సరాలు. తనదైన ఫిట్ నెస్ తో సోషల్ మీడియాలో ఉర్రూతలూగిస్తుంది మెనా.
ఇలాంటి ఫిట్ నెస్ మోడల్ ఒక చిన్న ఆపరేషన్ కు సిద్ధపడి ప్రాణాలు కోల్పోవడం ఆమె అభిమానులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. అసలు.. ఇలాంటి అనవసరమైన చికిత్సలు చేసుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అవసరమే లేని చికిత్సకు సిద్ధపడి ప్రాణాలు పోగొట్టుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.