ఘోర విమాన ప్రమాదం.. 133 మంది ప్రయాణికులతో పర్వతాల్లో కుప్పకూలిన బోయింగ్
హోర విమాన ప్రమాదం విషాదం నింపింది. నైరుతి చైనాలో 133 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బోయింగ్ విమానం పర్వతాల్లో కుప్పకూలింది. ఒక్కసారిగా విమానం నేల కూలడంతో భారీగా మంటలు చెలరేగాయి. అవి కాస్తా అడవి అంతా వ్యాపించడంతో అడవి మంటలుగా మారాయి. బాధితుల రెస్క్యూ కష్టంగా మారింది.
సోమవారం మధ్యాహ్నం ఈ ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్నట్టు చైనా మీడియా తెలిపింది. నైరుతి చైనాలోని గ్యాంగ్జిప్రావిన్స్ లో ఇవాళ మధ్యాహ్నం ఘోరం విమాన ప్రమాదం చోటుచేసుకుంది. చైనా ఈస్టర్న్ ఎయిర్ లైన్స్ సంస్థకు చెందిన బోయింగ్ 737 విమానం వుజా గ్రామ సమీపంలోని కొండల్లో కుప్పకూలిపోయింది.
ప్రమాద సమయంలో విమానంలో 133 మంది ప్రయాణికులున్నారు. విమానం కూలిన ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. అవి మెల్లగా విస్తరిస్తూ అటవీ ప్రాంతమంతా వ్యాపించాయి. ఎత్తైన కొండలు, పైగా రాకాసి మంటల నడుమ విమాన ప్రయాణ బాధితులను గాలించడం రెస్క్యూ సిబ్బందికి కష్టంగా మారింది.
చైనా ఈస్టర్న్ ఎయిర్ లైన్స్ సోమవారం మధ్యాహ్నం 1 గంటకు కున్మింగ్ నగరం నుంచి గ్వాంగ్జా నగరానికి బయలుదేరింది. అయితే గమ్యాన్ని చేరకముందే విమానం కుప్పకూలింది.
క్షేత్రస్తాయిలో కనిపిస్తోన్న దృశ్యాలను బట్టి ప్రయాణికులు ప్రాణాలతో బయటపడడం అసాధ్యమేనని..మొత్తం మంటల్లో కాలిపోయారని తెలుస్తోంది.
అమెరికాకు చెందిన ప్రఖ్యాత బోయింగ్ సంస్థ తయారు చేసిన భారీ విమానం ఘోర ప్రమాదానికి గురికావడం ఇది 4వ సారి. గతంలో బోయింగ్ విమాన ప్రమాదాల్లో మరణాల సంఖ్య కూడా భారీగానే ఉంది. బోయింగ్ విమానాల్లో సాంకేతిక లోపాల వల్లే ప్రమాదాలు తలెత్తుతున్నట్టు తేలడంతో కొన్నేళ్ల కింద ఆ సంస్థ విమానాలను కొద్దిరోజుల పాటు పూర్తిగా నిలిపేశారు.