ఆ నియోజకవర్గంలో లక్ష ఓట్లు బోగస్సేనా?

Update: 2015-12-10 08:06 GMT
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సీమాంధ్రులు ఎక్కువగా ఉండే అసెంబ్లీ నియోకవర్గాల్లో కూకట్ పల్లి ఒకటి. ఈ నియోజకవర్గంలో ఈ మధ్యన గ్రేటర్ అధికారులు 1.08లక్షల ఓట్లు తొలగించారు. ఆధార్ కార్డుల ఆధారంగా ఓటర్ల జాబితా నుంచి బోగస్ ఓట్లు ఏరివేసే క్రమంలో ఇంత భారీగా ఓట్లును తీసేశారు. దీనిపై తెలంగాణలోని విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. లక్షా ఎనిమిదివేల ఓట్లు తీసేసినా.. తిరిగి ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు వచ్చినోళ్లు 1203 మంది మాత్రమే రావటం విస్మయాన్ని కలిగిస్తోంది. ఓట్లు తొలగించిన వారి ఓట్లను మళ్లీ జాబితాలో నమోదు చేసుకోవచ్చంటూ కోరినా.. స్పందన ఏ మాత్రం లేకపోగా.. చాలా తక్కువ ఓట్లు మాత్రమే నమోదు కావటం గమనార్హం.

అదే సమయలో అధికారులు సైతం తొలగించిన ఓట్లలోని ఓటర్లను గుర్తించే పనిలో క్రాస్ చెక్ చేస్తే కేవలం 1250 మంది మాత్రమే ఇళ్లల్లో ఉన్నట్లుగా తేలిందని చెబుతున్నారు. ఈ క్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గంలో లక్ష ఓట్లకు పైగా బోగస్ అని తేల్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటిస్తే మాత్రం సంచలనంగా మారే అవకాశం ఉందంటున్నారు.
Tags:    

Similar News