ఏపీ మంత్రివర్గ విస్తరణ తరువాత తెలుగుదేశం నేతలంతా తమలోని కోపమంతా బయటకు కక్కేశారు. అందులో భాగంగానే మంత్రి పదవి పోగొట్టుకున్న బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కూడా చంద్రబాబుపై మండిపడ్డారు. దీంతో ఆయన్ను బుజ్జగించేందుకు ఎంపీ సీఎం రమేశ్, మంత్రి గంటాలను చంద్రబాబు పంపించగా వారిద్దరినీ బొజ్జల భార్య బృందమ్మ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి పంపించారని నిన్న సోషల్ మీడియా కోడై కూసింది. కానీ, అదంతా నిజం కాదని.. తాము వారినేమీ అనలేదని బొజ్జల తనయుడు సుధీర్ చెబుతున్నారు.
సీఎం రమేశ్, గంటాలు తమ వద్దకు వచ్చి ఆరోగ్య సమస్యల కారణంగా తమ తండ్రిని పదవి తొలగించారని చెప్పారు. అయితే ఆరోగ్య సమస్యలు అంటూ డీ గ్రేడ్ చేయడం సరికాదని చెప్పాం. ఆరోగ్య సమస్యలు సహజం. మానాన్న బాగా తిరుగుతున్నారు. అయినా ఇలాంటి కారణం చెప్తున్నారు. మా కుటుంబానికి మంత్రి పదవులు కొత్త కాదు. ప్రస్తుతం పదవి తొలగించినందుకు చంద్రబాబు పై కోపం లేదు. చేసిన పద్ధతే బాగాలేదని మాత్రం చెప్పామని ఆయన అన్నారు.
అంతేకాదు.. తన తండ్రి మూడేళ్లు మచ్చలేకుండా పని చేశారని.. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేశారు కానీ, టీడీపీకి చేయలేదని.. పార్టీ మారబోమని తెలిపారు. అలా పార్టీకి రాజీనామా చేసేది ఉంటే ఇప్పటికే చేసేవాళ్లమని చెప్పారు. అయితే.. అదేసమయంలో ఆయన కార్యకర్తలతో భేటీ అయి నిర్ణయాలు తీసుకుంటామని ట్విస్టు ఇచ్చారు. గంటా, సీఎం రమేష్ లను తాము నోటికొచ్చినట్టు మాట్లాడినట్టు జరుగుతున్న ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/