తమిళనాడు నుంచి గడ్డికోయడానికి వచ్చారా...?

Update: 2015-04-08 09:31 GMT
శేషాచలం కొండల్లో హతమైన ఎర్రచందనం కూలీల అంశం ఇప్పుడు వివాదాలకు దారితీస్తోంది. వారంతా తమిళనాడుకు చెందినవారు కావడంతో అక్కడ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వారంతా అమాయక కూలీలని తమిళనాడు వారు అంటుంటే అంతసీను లేదని ఏపీ అటవీ శాఖ మంత్రి అంటున్నారు. కల్లు తాగడానికి తాటి చెట్టెక్కినవాడిని.. ఎందుకెక్కావని అడిగితే దూడకు గడ్డి కోయడానికి అంటే ఎవరైనా నమ్ముతారా.... తమిళనాడు నుంచి వచ్చిన ఎర్రచందనం దొంగల విషయంలోనూ మంత్రి అలాంటి కామెంటే చేశారు. ఎన్‌ కౌంటర్‌ లో మృతులంతా ఎర్ర చందనం దొంగలేనని ... వారేమీ శేషాచలం అడవిలో గడ్డి కోసుకోవడానికి రాలేదని ఆయన అన్నారు.

    ఎన్‌ కౌంటర్‌ మృతుల బౌతిక కాయాలను తమిళనాడు పంపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని బజ్జల చెప్పారు. ఎర్ర చందనం కేసులో ఎంత పెద్ద వారు ఉన్నా వదలేదని ఆయన హెచ్చరించారు. విచారణలో పాత్రధారులు,సూత్రధారులు అంతా దొరుకుతారని ఆయన వ్యాఖ్యానించారు.ఏ పార్టీ వారికి ప్రమేయం ఉన్నా వదలేది లేదని ఆయన స్పష్టం చేశారు.
Tags:    

Similar News