గంజాయి విక్రేతలను అరెస్టు చేసిన పోలీసులపై టీడీపీ మాజీ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి రెచ్చిపోయారు. గంజాయి విక్రయం కేసులో ముగ్గురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడంపై భగ్గుమన్నారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని వీఎంపల్లెకు చెందిన టీడీపీ కార్యకర్తలు.. లక్ష్మణ్, రామకృష్ణ, వెంకయ్య గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో రెండో పట్టణ సీఐ భాస్కర్ నాయక్ నిందితులను అరెస్ట్ చేశారు.
దీంతో శివాలెత్తిన టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొజ్జల సుధీర్‌రెడ్డి నాయుడుపేట- పూతలపట్టు జాతీయ రహదారిపై మూడు గంటల పాటు ధర్నాకు దిగారు. దీంతో 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీనిపై డీఎస్పీ విశ్వనాథ స్పందిస్తూ.. స్టేషన్‌కు వచ్చి మాట్లాడాలని బొజ్జల సుధీర్ రెడ్డికి సూచించారు.
అయినా శాంతించని బొజ్జల, ఇతర టీడీపీ నేతలు పోలీసులపై నిందారోపణలు చేశారని అంటున్నారు. ఎవరో రూ.5 లక్షలు ఇస్తే తమ వారిపై పోలీసులు కేసులు పెట్టారంటూ ధ్వజమెత్తారు. తాము రూ.50 లక్షలు పడేస్తామని, తమ వారిని విడిచిపెట్టాలని రౌడీయిజం ప్రదర్శించారు. సీఐ భాస్కర్ నాయక్‌పై దూషణలకు పాల్పడ్డారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని.. తమ వాళ్లను అరెస్ట్ చేసిన వారి అంతు చూస్తామని బెదిరింపులకు దిగారు. తమ ప్రభుత్వం రాగానే వైఎస్సార్‌సీపీ నేతలకు చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. ఇకపై టీడీపీ నేతలపై కేసులు నమోదు చేస్తే రోడ్లపై నిరసనలకు, ధర్నాలకు దిగుతామని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.
గంజాయి కేసులో అరెస్టు అయిన వారిని విడుదల చేస్తేనే ఆందోళన విరమిస్తామంటూ సుధీర్‌రెడ్డి, టీడీపీ నేతలు పోలీసులపై బెదిరింపులకు దిగారు. ప్రయాణికులు తమకు ఇబ్బందిగా ఉందని చెప్పినా టీడీపీ నేతలు ఆందోళన విరమించలేదు. దీంతో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు ధర్నా ఎందుకు చేస్తున్నారంటూ టీడీపీ నేతలను నిలదీశారు.
గంజాయి కేసులో తమ వారిని అరెస్ట్ చేశారని చెప్పడంతో ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. అడిషనల్ ఎస్పీ వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదంటూ సుధీర్‌రెడ్డి ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు 41 నోటీసు జారీ చేసి గంజాయి కేసులో అరెస్టయిన వారిని స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. దీంతో సుధీర్‌రెడ్డి హైడ్రామాకు తెరదించారు.