మైక్రోసాఫ్ట్ అధినేత - ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ దానం ప్రపంచదేశాలకు మహాప్రసాదం. ఆయన ఏమి ఇచ్చినా ఆ దేశాలు కళ్లకు అద్దుకుంటాయి. కానీ లాటిన్ దేశం బొలివియా మాత్రం బిల్ గేట్స్ ఔదార్యాన్ని తోసిపుచ్చింది. ఆ వ్యాపారవేత్త దానం తమకు వద్దంటూ తేల్చి చెప్పింది. దీంతో బొలివియా ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.
పేదరికం హెచ్చు స్థాయిలో ఉన్న దేశాలకు కోళ్లను దానం ఇవ్వనున్నట్లు ఇటీవల బిల్ గేట్స్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఆఫ్రికా-సహారా దేశాలతో పాటు బొలివియాకు గేట్స్ దానం చేయాలనుకున్నారు. దీనిలో భాగంగానే ఆయన బొలీవియాకు లక్ష కోళ్లను కానుకగా ఇవ్వాలనుకున్నాడు. దాని వల్ల అక్కడ ఆకలి కేకలు అంతం అవుతాయని అనుకున్నాడు. కానీ గేట్స్ కు ఆ దేశం మరో విధంగా షాకిచ్చింది. బిలియనీర్ గేట్స్ ఇవ్వాలనుకుంటున్న కోళ్లు తమకు అవసరంలేదని ఆ వామపక్ష దేశం పేర్కొంది. ''బొలివియాను గేట్స్ ఎందుకు అలా చూస్తున్నారు? మేం 500 ఏళ్ల వెనక్కు జీవిస్తున్నామని ఎలా అనుకుంటారు? మా పౌల్ట్రీ శాఖ గురించి ఆ అమెరికా వ్యాపారవేత్తకు ఏమి తెలుసు? " అని బొలివియా అభివృద్ధి శాఖా మంత్రి సీజర్ కొకారికో ప్రశ్నల వర్షం కురిపించారు. తద్వారా దారిద్రాన్ని తరిమేందుకు బిల్ గేట్స్ చేయాలనుకు కోళ్ల దానాన్ని తిరస్కరించింది. ప్రతి ఏడాది బొలివియా 197 మిలియన్ల కోళ్లను ఉత్పత్తి చేస్తుంది. ఆ దేశం మరో 36 మిలియన్ల కోళ్లను విదేశాలకు ఎగుమతి చేస్తుందని లెక్కలు చెప్తున్నాయి.