వార్తలు రాసి నన్ను బెదిరిస్తావా...నీ సంగతి తేలుస్తా: విలేకరిపై వైసీపీ ఎమ్మెల్యే వీరంగం
ఓ న్యూస్ రిపోర్టర్ పై వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడని ప్రసారమాధ్యమాల్లో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. వార్తలు రాసి నన్ను బెదిరించాలని చూస్తావా, నీ సంగతి తేలుస్తా అంటూ హెచ్చరికలు జారీచేశారని ఎమ్మెల్యే అన్నట్టు ప్రచారం జరుగుతుంది. నిన్న తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ హెచ్చరికలు చేశారని, వినుకొండలో అసైన్డ్ భూములు ఆక్రమించి అక్రమంగా ప్లాట్లు వేస్తున్నారని, ఆ వార్తలు రాయకుండా పట్టణంలోని సమస్యలపైనే వార్తలు ఎందుకు రాస్తున్నారని విలేకరులను ఆయన ప్రశ్నించినట్టుగా ప్రచారం జరుగుతుంది.
మీడియా సమావేశమలో మాట్లాడుతూ .. ఓ పత్రికా విలేకరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడట. పట్టణంలో గత పదేళ్లలో సమస్యలు లేవా, ఇప్పుడే ఉన్నాయా, నువ్వు చాలా చేస్తున్నావ్. నీ సంగతేంటో తేలుస్తా. వార్తలు రాసి నన్ను బెదిరిస్తావా, నువ్వెంత అంటూ సీటులోంచి లేచి ఆగ్రహంతో ఊగిపోయారట. అయన అలా మాట్లాడుతుండడంతో కల్పించుకున్న ఓ చానల్ విలేకరి భూముల ఆక్రమణలపైనా వార్తలు రాస్తున్నామని చెప్పే ప్రయత్నం చేశాడట. దీంతో ఎమ్మెల్యే మరోమారు మండిపడ్డారట. ఎవరేం చేస్తున్నారో నాకు తెలుసు, నువ్వేం చేస్తున్నావో కూడా నాకు తెలుసు. బయటకు పో, అంటూ చిందులు తొక్కారని సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది.
దీంతో ఆ రిపోర్టర్ అక్కడి నుండి బయటకు వెళ్లిపోయాడట. తాగునీటి సమస్యలపై వార్తలు రాసిన మరో విలేకరిపైనా ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోతూ తిట్ల దండకం అందుకున్నారట. ఏది పడితే అది రాస్తే చూస్తూ ఊరుకుంటామా ఆత్మాభిమానాలు మాకు ఉంటాయంటూ మండిపడ్డారట. నన్ను బ్లాక్ మెయిల్ చేయాలంటే నీ తరం కాదు.. నువ్వెవరెవర్ని బ్లాక్ మెయిల్ చేశావో అందరి చిట్టా నా దగ్గర ఉంది. నీ మీద ఏం చేస్తానో చూద్దాం వుండు.. ఇది నీకు ఫస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అంటూ విలేఖర్ల అందరిముందు ఆగ్రహంతో ఊగిపోయారట. రిపోర్టర్ల పై ఎమ్మెల్యే వేసిన వీరంగం మీడియా సమావేశానికి వచ్చిన రిపోర్టర్లనందరిని షాక్ కు గురి చేసిందట. ఒక ప్రజా ప్రతినిధి వార్తలు రాసిన రిపోర్టర్ ను బాహాటంగా ఇలా బెదిరించడంపై జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయట. దీనిపై నిజానిజాలు తెలియాల్సి ఉంది.