ఢిల్లీ పేలుడుతో అప్రమత్తం.. ఉన్నతాధికారులతో అమిత్ ​షా అత్యవసరభేటీ..!

Update: 2021-01-30 03:52 GMT
దేశరాజధాని ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం బాంబ్​ పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్రహోంశాఖ, భద్రతా బలగాలు ఆరా తీస్తున్నాయి. పటిష్ఠమైన భద్రత ఉండే ఢిల్లీలో అది కూడా.. ఇజ్రాయెల్ ఎంబసీకి అతి సమీపంలో ఈ ఘటన జరగడంతో కేంద్రం సీరియస్ ​గా దృష్టి సారించింది. లోపం ఎక్కడ జరిగిందని ఆరా తీస్తున్నది. ఇప్పటికే పలు రాష్ట్రాలను కేంద్రం అలర్ట్​ చేసింది. ఆయా రాష్ట్రాల పరిధిలో ఉన్న ఎయిర్​ పోర్ట్​లలో ముమ్మర తనిఖీ లు నిర్వహిస్తున్నారు.

కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు, ఐబీ అధికారులతో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్​ షా అత్యవసరంగా భేటీ అయ్యారు. బాంబు పేలుడు ఘటనపై ఆయన పూర్తివివరాలు తెలుసుకున్నారు.  జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అమిత్‌షాకు ఈ ఘటనపై వివరించారు. పేలుడు జరిగిన ప్రాంతానికి కేవలం 2 కిలోమీటరల్ దూరంలో విజయ్​ చౌక్​ ఉంది. పేలుడు జరిగిన సమయంలోనే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీ.. ఇతర నేతలు బీటింగ్ రీట్రింగ్ కోసం అక్కడ సమావేశమయ్యారు.  వరస ఘటనలతో దేశరాజధాని అట్టుడుకుతున్నది.

జనవరి 26 న రైతుసంఘాల ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. కొందరు ఆందోళనకారులు ఏకంగా ఎర్రకోటమీదకు వెళ్లి జెండాలు ఎగరవేశారు.  బాంబు దాడితో దేశప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.ప్రస్తుతం ఉత్తరాఖండ్, హరిద్దార్, ఉద్దమ్ సింగ్ నగర్, డెహ్రాడూన్, నైనిటాల్‌లో హై అలర్ట్ కొనసాగుతోంది. అన్ని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్​చేసింది.
Tags:    

Similar News