అత్తాకోడళ్లపై అత్యాచారం.. ముగ్గురు మైనర్లు.. 37 కేసులు.. కీలక విషయాలు!

ఈ నేపథ్యంలో తాజాగా అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో హోంమంత్రి అనిత స్పందించారు.

Update: 2024-10-15 15:27 GMT

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై జరిగిన అత్యాచార ఘటన తీవ్ర సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై వీలైనంత వేగంగా దర్యాప్తు జరగాలని.. దోషులకు వేగంగా శిక్ష పడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని హోంమంత్రి అనిత తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె కీలక విషయాలు వెల్లడించారు.

అవును... శ్రీ సత్యసాయి జిల్లాలో అత్యాకోడళ్లపై జరిగిన అత్యాచార ఘటన తీవ్ర సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో హోంమంత్రి అనిత స్పందించారు. ఈ అత్యాచార ఘటనలో నిందితులను 48 గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. వీరికి వేగంగా శిక్షపడాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు.

ఇదే సమయంలో... సత్యసాయి జిల్లాలో జరిగిన ఘటనలో ఐదుగురు నిందితులను పట్టుకోగా.. వారిలో ఒకరిపై 37 కేసులు ఉన్నాయని ఆమె తెలిపారు. ఆ నిందితుడిపై అత్యాచార ఆరోపణలు కూడా ఉన్నాయని అనిత వెల్లడించారు. ఈ నేపథ్యంలో వీలైనంత తొందరగా విచారణ పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ఈ కేసును ప్రత్యేక న్యాయస్థానానికి అప్పగిస్తున్నట్లు తెలిపారు.

ఇదే సమయంలో సీసి కెమెరాల ద్వారా నిఘా పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపిన హోంమంత్రి.. ఈ విషయంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలని కోరుతున్నామని అన్నారు. ఇళ్లు, వ్యాపార సముదాయల వద్ద పెట్టుకున్న సీసీ కెమెరాలను పోలీసు శాఖకు అనుసంధానం చేస్తే.. నేర నియంత్రణ సాధ్యమవుతుందని తెలిపారు.

ఇదే క్రమంలో... ఈ కేసులోని నిందితుల వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ రత్న. ఇందులో భాగంగా... ఈ కేసులో ప్రధాన నిందితులు నాగేంద్ర, ప్రవీణ్ లతో పాటు మరో ముగ్గురు మైనర్లు ఉన్నరని.. వారినీ అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు. ఇదే సమహ్యంలో... ఈ కేసులో నిందితుల నేర చరిత్ర గురించి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.

రెండు రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో వాచ్ మెన్ గా పనిచేస్తున్న వ్యక్తిని, అతని కుమారుడిని కత్తులతో బెదిరించిన నిందితులు.. వారి ఇంటిలోకి వెళ్లి అత్తాకోడలిపై అత్యాచారం చేశారని.. అనంతరం రూ.5,200 డబ్బులు దోచుకుని వెళ్లిపోయారని ఎస్పీ వివరించారు!

Tags:    

Similar News