అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ లో తాజాగా చోటు చేసుకున్న అతి శక్తివంతమైన బాంబు పేలుళ్లు.. కలకలం రేపాయి. ఇవి పలు దౌత్యకార్యాలయాలు ఉన్న ప్రాంతంలో చోటు చేసుకోవటం గమనార్హం. జర్మనీ దౌత్యకార్యాలయమే లక్ష్యంగా బాంబు పేలుళ్లు జరిగినట్లుగా చెబుతున్నారు. భారత రాయబార కార్యాలయానికి 50 మీటర్ల దూరంలో.. జర్మనీ రాయబార కార్యాలయం గేటు దగ్గర భారీ బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
వివిధ దౌత్య కార్యాలయాలు ఇక్కడే ఉంటాయి. జర్మనీ దౌత్య కార్యాలయాన్ని.. మిగిలిన దౌత్య కార్యాలయాలకు ముఖ ద్వారంగా అభివర్ణిస్తుంటారు. మరో దారుణమైన విషయం ఏమిటంటే.. తాజా పేలుళ్ల కోసం వినియోగించిన బాంబు దాదాపు టన్నున్నర (సుమారు 1500 కేజీల) వరకూ ఉండొచ్చన్నది ప్రాథమిక అంచనా. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలిన ఈ బాంబు పేలుళ్లతో ప్రాణ నష్టం ఎంత జరిగిందన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇప్పటివరకూ అందుతున్న సమచారం ప్రకారం సుమారు 50 మందికి పైనే ఉంటారని తెలుస్తోంది. ఈ పేలుళ్ల ధాటికి భారత ఎంబసీ కిటికీ అద్దాలు మాత్రమే పగిలాయే కానీ.. సిబ్బంది ఎవరికి గాయాలు కాలేదని చెబుతున్నారు.
జర్మనీ దౌత్య కార్యాలయాన్ని మూసివేశారు. కార్యాలయంలో ఉన్న సిబ్బందిని హుటాహుటిన స్ట్రాంగ్ రూంకి తరలించారు. ఇప్పుడిప్పుడే అందుతున్న సమాచారం ప్రకారం.. పేలుళ్ల ధాటికి భారీ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. దౌత్య సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని చేస్తున్న దాడి చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/