మ్యాచ్ మ‌ధ్య‌లో బాంబు పేలుడు..అభిమానుల షాక్‌

Update: 2017-06-04 16:40 GMT
ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉగ్ర‌వాద భూతం ఎంత‌గా భ‌య‌పెడుతుందో తెలియ‌జెప్పేందుకు ఇదో ఉదాహ‌ర‌ణ‌. ఇటలీలో బాంబు పేలుడు జ‌రిగింద‌నే వార్త ఫుట్‌బాల్‌ ప్రేమికులను షాక్ కు గురి చేసింది. భారీ స్థాయిలో తొక్కిస‌లాట జ‌ర‌గ‌డంతో ఏకంగా 200 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. అయితే జ‌రిగింది బాంబు పేలుడు కాద‌ని మ్యాచ్ సాగుతున్న‌ సంబరంలో ట‌పాసుల చ‌ప్పుళ్ల‌ని తేలింది.

ట్యురిన్‌ లో జ‌రుగుతున్న‌చాంపియన్స్‌ లీగ్‌ ఫైనల్‌ ను శనివారం అర్ధరాత్రి పెద్ద ఎత్తున ఫుట్‌ బాల్‌ ప్రేమికులు వీక్షిస్తున్నారు. అయితే ఇదే స‌మ‌యంలో స్టేడియంలో పెద్ద ఎత్తున శ‌బ్దం వినిపించింది. బాంబు పేలిందని కొంద‌రు అభిమానులు అర‌వ‌డంతో స్టేడియంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. దీంతో అభిమానులు అంతా షాక్‌ కు గుర‌య్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు స్టేడియం నుంచి బ‌య‌ట వైపు ప‌రిగెత్తారు. ఇలా స్టేడియంలోని వారంతా తోసుకుంటూ ముందుకు సాగుతుండ‌టంతో 200 మంది తీవ్రంగా గాయప‌డ్డారు.

భారీ స్థాయిలో తొక్కిస‌లాట జ‌రిగిన‌ప్పటికీ ఎవ‌రికి ప్రాణ‌హాని జ‌ర‌లేదని స్థానిక పోలీసులు తెలిపారు. అయితే ప‌లువురికి మాత్రం గాయాలు అయిన‌ట్లు వివ‌రించారు. తొక్కిస‌లాట‌లో గాయ‌ప‌డిన వారిని స్థానికంగా ఉన్న ఆస్ప‌త్రికి తీసుకువెళ్లామ‌ని చికిత్స అందిస్తున్నామ‌ని తెలిపారు. కాగా గాయ‌ప‌డిన అభిమానుల‌ను త‌ర‌లిస్తున్న స‌మ‌యంలో తీసిన ఓ ఫొటోలు వంద‌ల కొద్ది బూట్ల జ‌త‌లు స్టేడియంలో ప‌డిపోవ‌డాన్ని గ‌మ‌నించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News