కోర్టు చేత చివాట్లు తిన్న మ‌హా పోలీసులు!

Update: 2018-09-04 05:06 GMT
చేతిలో అధికారం ఉంది క‌దా అని చెల‌రేగిపోతే.. అలాంటి వారి ఉత్సాహానికి బ్రేకులు వేయ‌టానికి వ్య‌వ‌స్థ‌లు మ‌న ప్ర‌జాస్వామ్యంలో ఉన్నాయ‌న్న విష‌యం కొన్ని ప‌రిణామాలు గుర్తు చేస్తుంటాయి. కోరేగావ్ భీమా కేసులో హ‌క్కుల నేత‌లు వ‌ర‌వ‌ర‌రావుతో స‌హా దేశ వ్యాప్తంగా ప‌లువురు ఉద్య‌మ నేత‌ల‌పై అర్బ‌న్ న‌క్స‌లైట్లుగా పేర్కొంటూ వారిని ఫూణే పోలీసులు అదుపులోకి తీసుకోవ‌టం తెలిసిందే.

ఈ వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. ప‌లువురు త‌ప్పు ప‌ట్టేలా చేసింది. ఆధారాలు ఉన్నాయా?  లేవా?  అన్న విష‌యంపై బోలెడ‌న్ని అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. ఈ విష‌యంపై సుప్రీంకోర్టు స్పందించాల‌న్న పిల్ పై అప్ప‌టిక‌ప్పుడు స్పందించిన అత్యున్న‌త న్యాయ‌స్థానం.. హ‌క్కుల నేత‌ల్ని జైలు నుంచి విడుద‌ల చేసి.. హౌస్ అరెస్ట్‌కు ఆదేశించింది. ఈ సంద‌ర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్య‌లు ఫూణె పోలీసుల‌కు ఎదురుదెబ్బ‌గా మారాయి.

ఇదిలా ఉంటే.. తాము చేసిన ప‌నిని స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేసిన మ‌హారాష్ట్ర పోలీసుల‌కు మ‌రోసారి ఎదురుదెబ్బ త‌గిలింది. తాజాగా బాంబే హైకోర్టు పోలీసుల‌కు అక్షింత‌లు వేస్తూ వ్యాఖ్య‌లు చేసింది.  వ‌ర‌వ‌ర‌రావుతో స‌హా ప‌లువురు హ‌క్కుల నేత‌ల్ని అరెస్ట్ చేసిన వైనంపై మ‌హారాష్ట్ర అద‌న‌పు డీజీ.. ఇత‌ర అధికారులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి.. తాము ప‌క్కా ఆధారాల‌తోనే హ‌క్కుల నేత‌ల్ని అరెస్ట్ చేసిన‌ట్లుగా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

ఈ సంద‌ర్భంగా కొన్ని ఉత్త‌రాల్ని వారు చ‌దివి వినిపించారు. దీనిపై ఒక వ్య‌క్తి హైకోర్టులో పిల్ వేయ‌గా.. దీనిపై స్పందించిన కోర్టు.. పోలీసుల తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. ఈ వ్య‌వ‌హారం కోర్టులో ఉన్న విష‌యాన్ని గుర్తు చేస్తూ.. కేసులో సాక్ష్యాలుగా ఉప‌యోగ‌ప‌డే ఉత్త‌రాల్ని బ‌హిరంగంగా ఎలా చ‌దివి వినిపిస్తారు? అంటూ ధ‌ర్మాస‌నం పోలీసుల్ని ప్ర‌శ్నించింది.

కేసు కోర్టులో ఉంద‌ని.. ఈ మొత్తం వ్య‌వ‌హారం సుప్రీంకోర్టు ప‌రిశీల‌న‌లో ఉన్న వేళ‌.. ఇలా కేసుల స‌మాచారాన్ని వెల్ల‌డించ‌టం త‌ప్పు అని పేర్కొంది. పోలీసుల తీరు స‌రిగా లేద‌న్న మాట హైకోర్టు వెల్ల‌డించింది. ప్ర‌ధాని మోడీపై హ‌త్యాయ‌త్నానికి ప్లాన్ చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కొంద‌రు హ‌క్కుల నేత‌ల్ని నాట‌కీయంగా అదుపులోకి తీసుకొని ఫూణెకు త‌ర‌లించ‌టం తెలిసిందే. హ‌క్కుల నేత‌ల అరెస్ట్ విష‌యంలో ఇప్ప‌టికే సుప్రీం చేతిలో తిట్లు ప‌డిన ఫూణె పోలీసుల‌కు తాజాగా బాంబే హైకోర్టు నుంచి ఆక్షింత‌లు ప‌డ‌టం గ‌మ‌నార్హం.  


Tags:    

Similar News