కొన్ని రోజుల క్రితం బట్టలపైనుంచి అమ్మాయిల ప్రైవేటు భాగాలను తాకితే నేరంగా పరిగణించలేమంటూ విచిత్రమైన తీర్పు ఇచ్చిన హైకోర్టు..తాజాగా అలాంటిదే మరో తీర్పు వెలువరిచింది. ఓ మహిళపై పురుషుడు ఒక్కడే ఎలా అత్యాచారం చేయగలడని ప్రశ్నించిన హైకోర్టు నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది.
ఒక వ్యక్తి.. ప్రాసిక్యూట్రిక్స్ నోటిని మూసి, ఆమె బట్టలు తొలగించడం, బలవంతపు లైంగిక చర్య చేయడం, ఎటువంటి అవాంతరాలు లేకుండా చేయడం చాలా అసాధ్యం అనిపిస్తుంది. ప్రాసిక్యూట్రిక్స్ కేసుకు వైద్య ఆధారాలు కూడా మద్దతు ఇవ్వవు అని హైకోర్టు బెంచ్ ధర్మాసనం అభిప్రాయపడింది. యావత్మల్ కు చెందిన 26 ఏళ్ల వ్యక్తిని శిక్షించినందుకు వ్యతిరేకంగా జస్టిస్ గణేడివాలా అప్పీల్ విన్నప్పుడు ఈ పరిశీలన జరిగింది.
అసలు కేసు విషయానికొస్తే .. 2013, జులై 26న తన కూతురుపై పొరుగింటి వ్యక్తి సూరజ్ కసర్కర్ అత్యాచారం చేశాడని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురుకు 15ఏళ్లు ఉన్నప్పుడు నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలిపారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడిపై ఛార్జీషీటు కూడా నమోదు చేశారు.
అయితే, బాధితురాలికి 18ఏళ్ల లోపు వయస్సున్నప్పుడు ఈ నేరం జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పెషల్ ట్రయల్ కోర్టు గుర్తించింది. కాగా, బాధితురాలికి 18ఏళ్ల కంటే ఎక్కువే వయస్సుందని, ఆమె సమ్మతంతోనే ఇద్దరూ లైంగిక చర్యలో పాల్గొన్నారని నిందితుడి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. బాధితురాలిపై బలవంతంగానే నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె తరపు న్యాయవాది కోర్టుకి తెలిపారు.
జస్టిస్ గణేడివాలా మాట్లాడుతూ బాధితురాలి సాక్ష్యం, ఆమె తల్లి, ఆమె జనన ధృవీకరణ పత్రంతో పాటు వైద్య సాక్ష్యాలు సంబంధిత సమయంలో, బాధితురాలు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారనే వాస్తవాన్ని నిర్ధారించలేదు వాంగ్మూలం ద్వారా వెళ్ళినా, బాధితురాలుఈ సంఘటన వివరించినట్లుగా, కోర్టు విశ్వాసాన్ని ప్రేరేపించదు, ఇది సహజమైన మానవ ప్రవర్తనకు వ్యతిరేకంగా ఉన్నందున కారణాన్ని విజ్ఞప్తి చేయదు అని అన్నారు.
ట్రయల్ కోర్టు ఆదేశించిన పదేళ్ల జైలు శిక్షను జస్టిస్ గణేడివాలా రద్దు చేయడంతోపాటు..స్థిరపడిన చట్టం ప్రకారం, శిక్షను కఠినంగా ఉండటం కోసం దృఢమైన రుజువు అవసరం. నిస్సందేహంగా, అత్యాచారం కేసులలో బాధితురాలి ఏకైక సాక్ష్యం నేర బాధ్యతను పరిష్కరించడానికి సరిపోతుంది,అయితే, నిందితులపై, తక్షణ కేసులో, ప్రాసిక్యూట్రిక్స్ సాక్ష్యం ప్రామాణికతను పరిగణనలోకి తీసుకుంటే, అప్పీలుదారుని పదేళ్లపాటు జైలుకు పంపడం తీవ్ర అన్యాయం అని జస్టిస్ గణేడివాలా స్పష్టం చేశారు.