బొండా ఉమా అడ్డంగా బుక్క‌య్యారే!

Update: 2018-01-28 09:10 GMT
టీడీపీ నేత‌, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు అడ్డంగా బుక్కైపోయార‌నే వార్త‌లు పెను సంచ‌ల‌నంగా మారిపోయాయి. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీ పొలిటిక‌ల్ కేపిట‌ల్‌గా మారిన విజ‌య‌వాడ‌లో స్థ‌లాల రేట్లు ఆకాశానికంటిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో కృష్ణా జిల్లా ప్ర‌త్యేకించి విజ‌య‌వాడ న‌గ‌రానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున దందాలు న‌డుపుతున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. మొన్న‌టికి మొన్న 20 మందికి పైగా ప్రాణాల‌ను బ‌లిగొన్న ప‌డ‌వ ప్ర‌మాదం కూడా ఓ అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధి అవినీతి దాహం వ‌ల్లే జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌లు లేక‌పోలేదు. ఈ నేప‌థ్యంలో ఆ వివాదం స‌ద్దుమ‌ణిగిందో, లేదో మ‌రో టీడీపీ కీల‌క నేత‌ - ఎమ్మెల్యేగా ఉన్న బొండా ఉమ అడ్డంగా బుక్కైపోయార‌ని నేటి మ‌ధ్యాహ్నం వెలువ‌డ్డ విష‌యం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచ‌ల‌నంగా మారింది. ఓ భూ వివాదంలో జోక్యం చేసుకున్న బొండా ఉమా ఫ్యామిలీ ఏకంగా రూ.40 కోట్ల విలువ చేసే భూమిని అప్ప‌నంగా త‌మ పేరిట రాసేసుకుంద‌ని, తాజాగా ఈ వివాదం అస‌లు రంగు బ‌య‌ట‌ప‌డ‌టంతో బొండా ఉమా స‌తీమ‌ణి సుజాత‌పై ఏకంగా కేసు న‌మోదైపోయింద‌న్న వార్త పెను క‌ల‌క‌లం రేపుతోంది. ఈ వ్య‌వ‌హారంపై అటు ఎలక్ట్రానిక్ మీడియాతో పాటుగా సోష‌ల్ మీడియాలోనూ వైర‌ల్ గా మారిపోయింది.

ఈ వివాదంలో త‌మ ప్ర‌మేయ‌మేమీ లేద‌ని బొండా ఉమా చెబుతున్న‌ప్ప‌టికీ... ప‌క్కా ఆధారాలు ల‌భించ‌డంతోనే అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఉమా స‌తీమ‌ణిపై పోలీసులు కేసు న‌మోదు చేశార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ వివాదం పూర్తి వివ‌రాల్లోకి వెళితే... స్వాతంత్య్ర స‌మ‌రంలో పాలుపంచుకున్న కొంద‌రు వ్య‌క్తుల‌కు  విజ‌య‌వాడ‌లో ప్ర‌భుత్వం కొంత భూమిని ఇచ్చింది. అయితే ఆ భూముల‌పై స‌దరు స్వాతంత్య్ర స‌మర‌యోధుల కుటుంబాల‌కు పెద్ద‌గా అవ‌గాహ‌న లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. అయితే ఇటీవ‌లి కాలంలో స‌ద‌రు భూమి విలువ ల‌క్ష‌లు దాటి కోట్ల‌కు చేరింది. ఈ నేప‌థ్యంలో ఆ భూమిపై క‌న్నేసిన బొండా ఉమా... రూ. 40 కోట్ల విలువైన భూమి క‌బ్జా చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో రామిరెడ్డి కోటేశ్వ‌ర‌రావు అనే వ్య‌క్తి త‌న కుటుంబ అవ‌స‌రాల నిమిత్తం బొండా ఉమా అనుచ‌రుల వ‌ద్ద‌కు అప్పు కోసం వెళ్ల‌గా... భూమి త‌న‌ఖా పెడితేనే అప్పు పుడుతుంద‌ని చెప్పి ఆయ‌నతో ఖాళీ పేప‌ర్ల మీద సంత‌కాలు చేయించుకున్నార‌ట‌. అవే ప‌త్రాల‌ను ఇప్పుడు స్వాతంత్య్ర స‌మ‌ర యోధుల‌కు చెందిన భూమిని కోటేశ్వ‌ర‌రావు త‌మ‌కు విక్ర‌యించినట్లుగా బొండా మార్చేసింద‌ట‌.

ఆ త‌ర్వాత స‌ద‌రు భూమిని స్వాధీనం చేసుకునే క్ర‌మంలో విష‌యం తెలుసుకున్న స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడి వార‌సులు రంగంలోకి దిగారు. త‌మకు చెందిన భూమిని బొండా ఉమా వేరే వ్య‌క్తుల ద్వారా కొన్న‌ట్లుగా త‌ప్పుడు ప‌త్రాలు సృష్టించార‌ని, తాము ఆ భూమిని వేరే ఎవ‌రికీ విక్ర‌యించ‌లేద‌ని నేరుగా సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో బాధితుల ఫిర్యాదును ప‌రిశీలించ‌డంతో పాటుగా మొత్తం వ్య‌వ‌హారాన్ని ఆరా తీసిన పోలీసులు.. బాధితుల వాద‌న‌లో నిజ‌ముంద‌ని గ్ర‌హించి బొండా ఉమా స‌తీమ‌ణి సుజాత‌పై కేసు న‌మోదు చేశారు. విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌డంతో పాటుగా బొండా ఉమా స‌తీమ‌ణిపై కేసు న‌మోదైన నేప‌థ్యంలో రంగంలోకి దిగిన బొండా ఉమా అనుచ‌రులు... కోటేశ్వ‌ర‌రావును త‌మ దారికి తెచ్చుకునేందుకు య‌త్నించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఎదురు తిర‌గ‌డంతో బెదిరింపుల‌కు కూడా దిగార‌ట‌. దీంతో చేసేదేమీ లేక కోటేశ్వ‌రావు నేరుగా విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్ గౌతం స‌వాంగ్‌ను ఆశ్ర‌యించారు.

త‌న‌కేమీ తెలియ‌ద‌ని, అప్పు కోసం వెళితే... త‌న‌తో ఖాళీ ప‌త్రాల‌పై సంత‌కాలు చేయించుకుని ఇప్పుడు భూమి అమ్మిన‌ట్లుగా చెప్పాల‌ని బెదిరిస్తున్నార‌ని కోటేశ్వ‌ర‌రావు వాపోయారు. దీంతో బొండా ఉమా అడ్డంగా బుక్కైపోయార‌న్న వాద‌న వినిపిస్తోంది. మొత్తానికి పక్కా ఆధారాల‌తోనే బొండా ఉమా స‌తీమ‌ణిపై పోలీసులు కేసు న‌మోదు చేయ‌గా... ఈ వివాదం ఎంత‌దాకా వెళుతుందోన‌ని, అస‌లు బొండా ఉమా రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై ఈ వివాదం ఏ మేర ప్ర‌భావం చూపుతుందోన‌న్న చ‌ర్చ‌కు తెర లేసింది. అయితే ఈ వివాదంపై స్పందించిన బొండా ఉమా... ఈ వ్య‌వ‌హారంలో త‌మ ప్ర‌మేయం ఏమీ లేద‌ని కొట్టిపారేశారు. అంతేకాకుండా త‌న అనుచ‌రులెవ‌రూ భూక‌బ్జాల‌కు పాల్ప‌డ‌ల‌దేని,  ఇదంతా విప‌క్షం వైసీపీ నేత‌లు ఆడుతున్న నాట‌కంగా అభివ‌ర్ణించారు. ఈ విష‌యంపై తాను బ‌హిరంగ చ‌ర్చ‌కు కూడా సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు.
Tags:    

Similar News