బొండా ఉమామహేశ్వరరావు. టీడీపీలో మంచి దూకుడు ఉన్న యువ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. లేటుగా రాజకీయ ఎంట్రీ ఇచ్చినా.. లేటెస్ట్ దూకుడుతో ఆయన అందరి దృష్టినీ ఆకర్షించారు. టీడీపీ హయాంలో అయితే.. ఓ రేంజ్‌లో ఆయన దూసుకుపోయారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో చంద్రబాబు సైతం ప్రోత్సహించారు. పార్టీలోను, నియోజకవర్గంలోనూ ఆయనకు తిరుగులేదనే రేంజ్‌లో వ్యవహారం సాగింది. ఈ క్రమంలోనే అసెంబ్లీలో వైసీపీ నేతలను అరెయ్.. ఒరేయ్.. అని సంబోధించి.. ఉగ్ర స్వరూపం ప్రదర్శించి.. టీడీపీ అధినేత దగ్గర మంచి మార్కులు సంపాయించుకున్నారు. అయితే.. గత ఏడాది ఎన్నికల్లో కేవలం 25 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఈ క్రమంలో కొన్నాళ్లు సైలెంట్ అయిపోయారు. దీంతో ఇక, పార్టీలో ఉండరనే కామెంట్లు వచ్చినా.. ఏమైందో ఏమో .. పార్టీలోనే కొనసాగారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మంచి పట్టున్న నాయకుడుగా ఆయన ఇప్పటికీ పేరు గడిస్తున్నారు. ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన మల్లాది విష్ణు. సొంత వ్యవహారాలు చూసుకుంటూ ఉండడంతో బొండా దూకుడు కు ప్రాధాన్యం పెరిగింది. అయితే.. ఈయన వ్యవహారం షరతులు వర్తించును! అనే పంథాలో సాగుతోందనే వాదన వినిపిస్తోంది. పార్టీ గుర్తింపు ఇవ్వడం లేదని కొన్నాళ్లు అలిగారు. దీంతో చంద్రబాబు ఏకంగా సీనియార్టీతో సంబంధం లేకుండా కీలకమైన పొలిట్ బ్యూరోలో సభ్యత్వం ఇచ్చారు. దీంతో దూకుడు పెంచుతారని అందరూ అనుకున్నారు.
అనుకున్నట్టుగానే బొండా ఉమా దూకుడు పెంచారు. ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కానీ, ఆయనకు గుర్తుకు వచ్చినప్పుడు మాత్రమే మీడియా ముందుకు రావడం లేదంటే.. ఫుల్‌గా సైలెంట్ అయిపోవడం.. పార్టీ తరఫున ఎలాంటి కార్యక్రమాల కూ హాజరు కాకపోవడంతో పార్టీ ఆశించిన మేరకు ఆయన దూకుడు చూపించడం లేదని సీనియర్లు అంటున్నారు. అయితే.. బొండాపై కొన్ని కేసులు ఉన్నాయని.. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడే పరిస్థితి లేదని.. వైసీపీ నాయకులు అంటున్నారు. దీంతో బొండా దూకుడు రెండు అడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా మారిపోయింది. అయితే.. నియోజకవర్గంలో మాత్రం ప్రజాభిమానం ఆయనవైపే ఉండడం గమనార్హం. ఏ సమస్య వచ్చినా.. బొండా వైపే ఇక్కడి ప్రజలు చూస్తున్నారు. సో.. ఆయన కొంత పుంజుకుంటే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ పాగా వేయడం ఖాయమని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.