అసెంబ్లీ నియోజకవర్గం : విజయవాడ సెంట్రల్
టీడీపీ : బోండా ఉమ
వైసీపీ : మల్లాది విష్ణు
-------------------------------------------------
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం.. ఒకరకంగా ఇది బెజవాడ రాజకీయాలకు సెంట్రల్ పాయింట్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే రాజధాని అమరావతికి దగ్గర్లోని ప్రధాన నగరమైన విజయవాడలో ఉండడంతో అందరి చూపు దీనిపైనే నెలకొంది. పైగా దిగ్గజ నేతలు ఈసారి బరిలో ఉండడంతో హీట్ పెరిగింది. 2008 పునర్విభజన సమయంలో ఈ నియోజకవర్గం ఏర్పడింది.
*నియోజకవర్గ చరిత్ర
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 2008లో ఏర్పడ్డింది. 2009 లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున నిలబడ్డ మల్లాది విష్ణు ఘనవిజయం సాధించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఇదే సెంట్రల్ నియోజకవర్గం నుంచి బోండా ఉమా 30వేలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఉమా వైసీపీ నుంచి బరిలోకి దిగి గౌతంరెడ్డిపై గెలిచారు.
* బొండా ఉమా వర్సెస్ మల్లాది విష్ణు
2019 సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలకు కేంద్రమైన విజయవాడ పాలిటిక్స్ హీటెక్కాయి. ఈసారి టీడీపీ నుంచి మరోసారి బోండా ఉమా నిలబడగా.. వైసీపీ నుంచి ఈసారి బలమైన మల్లాది విష్ణు రంగంలోకి దిగారు. వీరిద్దరూ నువ్వా నేనా అనట్టుగా తలపడుతున్నారు. అధికారంలో ఉన్న ఉమా అక్రమాలను మల్లాది గడిచిన కొన్నేళ్లుగా వెలికి తీస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. వరుస ఆరోపణలు చేస్తూ ఉమాకు కొరకరాని కొయ్యగా మారాడు. దీంతో వీరిద్దరి ఫైట్ ఇప్పుడు సెంట్రల్ లోనే కాదు ఏపీ వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.
*బోండా ఉమా అవినీతి, ఆధిపత్యమే మైనస్
ప్రతికూలం: 2014లో ఈజీగా గెలిచిన బోండా ఉమాకు ఈసారి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. మరో నెలరోజుల్లోనే జరగబోయే ఎన్నికల్లో టీడీపీ నుంచి నిలబడ్డ బోండా ఉమాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని టాక్. గత అయిదేళ్లుగా ఆయన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ప్రజలను చులకనగా చూసి ఆ వీడియోలు మీడియాలో రావడంతో అభాసుపాలయ్యాడు. ఇక భూ కబ్జాలు, దందాలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ సంక్షేమపథకాలు, కాంట్రాక్టుల్లో ఉమా అవినీతిపై నియోజకవర్గంలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోందని చెబుతున్నారు. అందుకే ఈసారి మరోసారి బరిలోకి దిగిన ఉమాకు అనుకూల గాలి లేదన్న టాక్ వినిపిస్తోంది.
అనుకూలం: ఇంత వ్యతిరేకత ఉన్నా టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా, మాటకారిగా గుర్తింపు పొందడం ఉమాకు కలిసివస్తోంది. సెంట్రల్ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలయ్యేలా చేయడం వంటివి బొండాకి మరోసారి సీటు వచ్చేలా చేశాయి. ఇక సెంట్రల్ లో గట్టి పట్టు ఉన్న వంగవీటి రాధా ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరారు. రాధా టీడీపీలో చేరడంతో బోండా ఉమకి రాధా మద్దతుదారులు సపోర్ట్ గా నిలిచే అవకాశం ఉంది.
*మల్లాది విష్ణుకు గెలుపు గ్యారెంటేనా.?
ప్రతికూలం: మల్లాది విష్ణు ప్రధానంగా టీడీపీ మీద వ్యతిరేకత మీదే ఆధారపడ్డారు. కానీ వంగవీటి రాధా టీడీపీలో చేరడంతో కాపు ఓటు వైసీపీకి పడడం కష్టమే.. ఇదే ఈయనకు మైనస్ గా మారింది. కాపులు మెజార్టీ మల్లాదికి సపోర్టు చేస్తారో లేదోనన్న టెన్షన్ ఎక్కువైంది. కాపు ఓటింగ్ చేజారిపోతే మల్లాదికి చిక్కులు తప్పవు.
అనుకూలం: విజయవాడ సెంట్రల్ లో బోండా ఉమాకు సరైన ప్రత్యర్థిగా మల్లాది విష్ణు నిలుస్తున్నారు. సీనియర్ నేత కావడం.. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన కావడంతో టఫ్ ఫైట్ ఇస్తున్నారు.విష్ణు కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. అలాగే విష్ణు సామాజికవర్గం వారు కూడా ఇక్కడ బాగానే ఉండడం కలిసివచ్చే అంశం.
*కమ్యూనిస్టులకు వదిలేసిన జనసేన
విజయవాడ సెంట్రల్ లో కాపులు బాగానే ఉన్నారు. కానీ ఇక్కడ టీడీపీ అభ్యర్థి బోండా ఉమాకు ఫేవర్ గా జనసేన పోటీ పెట్టకపోవడం విశేషం. విజయవాడ పశ్చిమ, తూర్పులకు జనసేన అభ్యర్థులను ప్రకటించింది. సెంట్రల్ పై మాత్రం కమ్యూనిస్టులకు వదిలేసింది. దీంతో జనసేన కావాలనే సెంట్రల్ లో డమ్మీని నిలబెట్టిందన్న టాక్ వినిపిస్తోంది. అది టీడీపీకే ఫేవర్ అని అంటున్నారు.
*అంతిమంగా మల్లాది విష్ణుకే మొగ్గు
బోండా ఉమా, టీడీపీపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని గ్రౌండ్ రిపోర్టులో తేలింది. వారి వ్యతిరేకతే మల్లాది విష్ణుకు ప్లస్ అవుతోంది. బోండా ఉమాను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. మరి ఎన్నికల వేళ ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకు వేచిచూడాల్సిందే..