పోలీసుల‌పై బొండా ఉమా బూతుల ప‌ర్వం..

Update: 2020-01-07 14:04 GMT
ఆయ‌నో మాజీ ప్ర‌జాప్ర‌తినిధి. చ‌ట్టాన్ని గౌర‌వించాల‌నే క‌నీస సూత్రాన్ని కూడా పాటించ‌కుండా.. చ‌ట్ట ప‌రిర‌క్ష‌కులుగా ఉన్న పోలీసుల పై నోరేసుకుని ప‌డిపోయాడు. నోటికి ఎంత మాట వ‌స్తే..అంత మాట అనేశాడు. నీ అంతు చూస్తా.. నోర్ముయ్‌!! నీ చొక్కా విప్పిస్తా!! అంటూ.. ఓ స‌బ్ ఇన్‌ స్పెక్ట‌ర్‌ పై న‌డిరోడ్డుమీదే ప‌దుల సంఖ్య‌లో కార్య‌క‌ర్త‌ల మ‌ధ్యే రెచ్చిపోయాడు. ఆయ‌నే విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఏడాది ఓడిపోయిన టీడీపీ నేత బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు. ఈ ప‌రిణామంతో ఒక్క‌సారిగా పోలీసు శాఖే నివ్వెర పోయింది. ప్ర‌స్తుతం రాజ‌ధాని అమ‌రావ‌తిపై టీడీపీ నేత‌లు ఆందోళ‌న చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ వారం రాష్ట్ర రాజ‌ధాని ప‌రిధిలోని ర‌హ‌దారుల దిగ్భంధానికి పిలుపునిచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు అదే స‌మ‌యంలో విజ‌య‌వాడలో కీల‌క‌మైన బెంజిస‌ర్కిల్‌ లో తూర్పు నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ చేప‌ట్టిన‌దీక్ష‌కు మ‌ద్ద‌తిచ్చేం దుకు మాజీ ఎమ్మెల్యే అయిన బొండా ఉమా త‌న అనుచ‌రుల‌తో ఇంటి నుంచి బ‌య‌ల్దేరారు. అయితే, పోలీసులు శాంతి భ‌ద్ర‌త‌ల నేప‌థ్యంలో టీడీపీ నేత‌ల‌ను ఇళ్ల‌కే ప‌రిమితం చేస్తున్నారు. హౌస్ అరెస్టు చేయ‌డం ద్వారా ప‌రిస్థితి అదుపుత‌ప్ప‌కుండా చేయ‌డం అనేది గ‌త చంద్ర‌బాబు హ‌యాంలోనే విస్తృతంగా సాగింది. కాపుల ఉద్య‌మం సాగిన‌ప్పుడు, ప్ర‌త్యేక హోదా కోసం ఉద్య‌మానికి విద్యార్థులు రెడీ అయిన‌ప్పుడు చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా విప‌క్ష పార్టీల నాయ‌కుల‌ను ఎక్క‌డిక‌క్క‌డ హౌస్ అరెస్టులు చేయిం చి, రాష్ట్రంలో ఎక్క‌డా ఎలాంటి ఆందోళ‌న‌లూ లేవ‌నే క‌వ‌రేజ్ ఇచ్చుకునేవారు.

అయితే, ఇప్పుడున్న వైసీపీ ప్ర‌భుత్వం భావ‌ప్ర‌క ట‌నా స్వేచ్ఛ‌కు అవ‌కాశం ఇస్తూనే ప్ర‌జాస్వామ్యంలో ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు వ్య‌క్తీక‌రించుకునేందుకు కూడా అన్ని పార్టీల‌కూ అవ‌కాశం ఇస్తోంది. అయితే, వీటిని శాంతి యుతంగా నిర్వ‌హించాల‌ని మాత్రమే పోలీసులు చెబుతున్నారు. కానీ, టీడీపీ అధినేత చంద్ర‌బాబు సోమ‌వారం అమ‌రావ‌తిలో ప్ర‌సంగిస్తూ.. రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేశారు. అవ‌స‌ర‌మైతే.. జైళ్ల‌కు వెళ్తాం. ఈ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొడ‌తాం.. అంటూ వ్యాఖ్య‌లు చేశారు. దీంతో మంగ‌ళ‌వారం నాటి ర‌హ‌దారుల దిగ్భందం కార్య‌క్ర‌మంలో హింస చెల‌రేగే అవ‌కాశం ఉంటుంద‌ని ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు ప్ర‌భుత్వానికి స‌మాచారం ఇచ్చాయి. దీంతో కీల‌క నాయ‌కుల‌ను పోలీసులు వారి ఇళ్ల‌లోనే నిర్బంధించే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా పోలీస్ స్టేష‌న్ల ప‌రిధిలో ఎస్సైలు టీడీపీ నేత‌ల ఇళ్ల‌కు వెళ్లి వారిని ఇంటి నుంచి బ‌య‌టకు రావొద్ద‌ని సూచించారు.

దీంతో చాలామంది నాయ‌కులు ఎలాంటి వాగ్వాదం లేకుండా చ‌ట్టానికి తాము స‌హ‌క‌రిస్తామంటూ.. పోలీసుల‌కు స‌హ‌క‌రించారు. అయితే, ఆది నుంచి కూడా తీవ్ర వివాదాస్ప‌ద నేత‌గా పేరు తెచ్చుకున్న బొండా ఉమా మాత్రం రెచ్చిపోయాడు. తాము అధికారంలో లేమ‌నే(ఉన్నా కూడా పోలీసుల‌ను దూషించ‌డం నేరం) ధ్యాస కూడా లేకుండా.. త‌న ఇంటికి వ‌చ్చి.. సార్ మీరు బ‌య‌ట‌కు రావొద్దు. పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. ఇంటికే ప‌రిమితం అవ్వండి! -అంటూ బ‌తిమాలుతున్న ధోర‌ణితో ఎస్సై చెబుతున్నా.. విన‌కుండా ప‌రుషంగా జులుం ప్ర‌ద‌ర్శించాడు బొండా! ``నువ్వెవ‌రు.. న‌న్ను ఆప‌డానికి..`` అంటూ ఎస్సై స‌హా కానిస్టేబుళ్ల‌పై దూసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేశారు. దీనికి తాము పోలీసుల‌మ‌ని. పై అధికారులు చెబితే వ‌చ్చామ‌ని ఎస్సై వివ‌రించారు.

`ఏది నోటీసు చూపించు`-అంటూ మ‌ళ్లీ బిగ్గ‌ర స్వ‌రంతో హెచ్చ‌రిక‌గా ప్ర‌శ్నించాడు బొండా. అంతేకాదు, నాఇంటి గుమ్మం దిగు-అంటూ ఘీంక‌రించాడు. దీంతో ఎస్సై.. స‌హా కానిస్టేబుళ్లు గేటు బ‌య‌ట‌కు రోడ్డు మీద‌కు మ‌రో రెండు అడుగులు వేసి.. సార్ మీరు బ‌య‌ట‌కు రావొద్దు.. అనిసూచించారు. దీంతో మ‌రింత రెచ్చిపోయిన బొండా .. ``నోర్ముయ్‌.. నోర్ముయ్‌.. ఖాకీ చొక్కా వేసుకున్నాన‌ని అనుకుంటున్న‌వా.. ఉద్యోగివి ఉద్యోగం చేసుకో.. లేక‌పోతే.. నీ చొక్కా ఎలా విప్పించాలో తెలుసు``-అంటూ ప‌క్కా రౌడీ మాదిరిగా రెచ్చిపోవ‌డంతో పోలీసులు నివ్వెర పోయారు. అయినా కూడా ప‌రిస్థితి ఎక్క‌డ గాడి త‌ప్పుతుందోన‌ని భావించిన ఎస్సై స‌హా పోలీసులు.. మౌనంగా అక్క‌డే ఉండి..`` స‌రే సార్ మీరు ఏం చేయాలంటే అది చేయండి`` అంటూ వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

దీంతో అంద‌రూ టీడీపీ నేత‌ల త‌ర‌హా ఆకు రౌడీల క‌న్నా ఘోరంగా ఉందే అని బుగ్గ‌లు నొక్కుకుంటున్నారు. కొన్నాళ్ల కింద‌ట అనంత‌పురం టీడీపీ నాయ‌కుడు జేసీ దివాక‌ర్ రెడ్డి కూడా ఇలానే పోలీసుల‌పై రెచ్చిపోయి వారి హిజ్రాల‌తో పోల్చ‌డం - బూట్లు నాకుతార‌ని వ్యాఖ్యానించ‌డం తీవ్ర సంచ‌ల‌నం సృష్టించాయి. ఇక‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏకంగా డీజీపీని బెదిరించ‌డం తెలిసిందే. మేం వ‌స్తే.. వ‌డ్డీతో స‌హా తీర్చుకుంటాం.. అని వ్యాఖ్యానిస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో.. అధినేతే ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటే.. కిందిస్థాయి వారు ఇలాకాక ఇంకెలా ఉంటార‌ని అంటున్నారు ప్ర‌జ‌లు.


Tags:    

Similar News