ఆలోచించి చేస్తారో.. లేదంటే ఎవరో ఒకరికి పని అప్పగించి వదిలేస్తారో కానీ.. తెలుగుదేశం నేతలు తీసుకునే నిర్ణయాలు చాలా చిత్రంగా ఉంటాయి. పబ్లిక్ గా తాము చేసే పనులకు సంబంధించిన పరిణామాలు చాలా ఉంటాయన్న ఆలోచన లేకుండా చేసే కొన్ని కార్యక్రమాలు వారికి లేనిపోని తలనొప్పులుతెచ్చిపెట్టే పరిస్థితి.
తాజాగా జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లాకు చెంది ఏపీ అధికారపక్షానికి చెందిన బొండా ఉమా మహేశ్వరరావు ఒక టీవీ యాడ్ జారీ చేశారు. తన పేరు మీద పవన్ కు బర్త్ డే విషెష్ చెప్పేందుకు యాడ్ ఇవ్వటంలో తప్పు లేదు కానీ.. ఆ యాడ్ లో ఉన్న కంటెంట్ కాస్త ఆసక్తికరంగా ఉంది.
ఏపీ రాజధాని ప్రాంతంలో ఏపీ సర్కారు భూ సేకరణ విషయంలో బాబు.. పవన్ ల మధ్య వచ్చిన తేడాలు అందరికి తెలిసిందే. ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నట్లుగా తాజా యాడ్ ఉండటం విశేషం. జనసేనాధిపతితో తమ అధినేత (చంద్రబాబు) సంబంధాల సహృద్భావ వాతావరణంలో కొనసాగాలని బొండా అభిలషించటం చూసినప్పుడు.. ఇంటి గుట్టును ఇంట్లో వారే రట్టు చేసినట్లుగా ఉందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ పవన్ మీద అభిమానమో.. ఆయన వర్గానికి చెందిన వారినో ఆకర్షించాలనో అనుకుంటే.. జన్మదినోత్సవ శుభాకాంక్షలు చెబితే సరిపోయే దానికి.. అందుకు భిన్నంగా సీన్లోకి అధినేత బాబును లాగటం ఎందుకు బొండా..?