జగన్ శాసనసభకు తొలిసారిగా ఎన్నికయ్యాడు..ఆయనకు నిబంధనలు తెలియవు...కనీసం స్పీకర్ చెప్పినా వినడు..అలాంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండడం దురదృష్టకరమని విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. శాసనసభ వాయిదా పడిన అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడారు. శాసనసభకు ఫస్ట్ టైం ఎన్నికైన జగన్ చిన్నపిల్లాడు చెపితే వినడు..తిడితే ఏడుస్తాడన్న చందంగా వ్యవహరిస్తున్నారంటూ ఉమ జగన్ తీరును దుయ్యబట్టారు.
కనీసం సంతాప తీర్మానంపై ఎలా మాట్లాడాలో కూడా జగన్ కు తెలియదని ఉమ ఎద్దేవా చేశారు. జగన్ వ్యవహార శైలి వల్ల శాసనసభ ప్రతిసారి వాయిదా పడుతోందని..దీనివల్ల అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించే విలువైన సమయం వృథా అవుతోందన్నారు. రాజమండ్రి పుష్కరాల ఘటనలో మృతి చెందిన వారికి..ప్రత్యేక హోదా కోసం చనిపోయిన వారికి సంతాపం తెలుపుతుంటే దానిని కూడా జగన్ రాజకీయ లబ్ధికోసం వాడుకోవాలని చూడడం దురదృష్టకరమని ఉమ చెప్పారు. జగన్ వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారని కూడా ఉమ చెప్పారు.