కరోనా భయానికి విమానం మొత్తం బుక్ చేశాడు

Update: 2021-01-08 13:02 GMT
కరోనా భయం జనాలను ఇంకా వీడడం లేదు. ఆ భయానికి ప్రయాణాలు చేయాలంటేనే జనాలు వణికిపోతున్నారు. ఇక విదేశీ ప్రయాణాలు, విమాన ప్రయాణాలంటే జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

అయితే కరోనా భయం నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. అయినా కూడా ఇప్పటికీ రద్దీ ప్రాంతాలకు వెళ్లాలన్నా..నలుగురితో కలవాలన్నా భయం వెంటాడుతూనే ఉంది.

తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే మాస్క్ లు.. రక్షణ కోసం పీపీఈ కిట్లు ధరిస్తున్నారు. అయితే ఇక్కడో వ్యక్తి వింతగా ఆలోచించాడు. ఇండోనేషియా దేశానికి ఓ వ్యక్తి విమాన ప్రయాణంలో వైరస్ నుంచి రక్షణ కోసం ఏకంగా విమానంలోని అన్ని సీట్లను బుక్ చేసుకోవడం విశేషం.

జకార్తాకు చెందిన రిచర్డ్ ముల్ జాదీ తన భార్య షల్విన్నీ ఛాంగ్ తో కలిసి ఇటీవలే బాలీ వెళ్లారు.ఇందు కోసం లయన్ ఎయిర్ లైన్స్ కు చెందిన బాటిక్ ఎయిర్ విమానంలోని అన్ని సీట్లను బుక్ చేసుకున్నాడు.

విమానంలో ఇతర ప్రయాణికులు ఉంటే వారి నుంచి కరోనా సోకే ప్రమాదం ఉందని భావించి రిచర్డ్  వైరస్ నుంచి రక్షణ కోసం ఈ విధంగా విమానం మొత్తాన్ని బుక్ చేయడం విశేషం. ఖాళీగా ఉన్న విమానంలో కూర్చున్న ఫొటోను రిచర్డ్ షేర్ చేయడంతో అది వైరల్ అయ్యింది. ప్రైవేట్ జెట్ కంటే కూడా అన్ని సీట్లను బుక్ చేసినా తనకు తక్కువే ఖర్చు అయ్యిందని రిచర్డ్ తెలిపాడు.
Tags:    

Similar News