నందిగామ రోడ్డు ప్రమాదంపై అటు అధికార పార్టీ టీడీపీతో పాటు ఇటు అధికారులు - పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతల కంటే ముందుగానే స్పందించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... హుటాహుటీన నందిగామ వెళ్లి ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించడంతో పాటు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను - చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదానికి ప్రధాన కారకుడిగా భావిస్తున్న డ్రైవర్ ఆదినారాయణ మృతదేహానికి పోస్టుమార్టమ్ జరగని వైనాన్ని గుర్తించిన జగన్... ఇదేంటని ప్రశ్నించారు.
డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టమ్ జరగకపోతే... ప్రమాదానికి గల కారణం ఎలా తెలుస్తుందని ఆయన వైద్యులను నిలదీశారు. ఈ క్రమంలోనే దీనిపై ఏం నివేదిక సిద్ధం చేశారని ప్రశ్నించిన జగన్... వైద్యుల చేతుల్లోని పత్రాలు తీసుకోగా... వాటిని జగన్ చేతుల్లో నుంచి తీసుకునేదాకా అటు వైద్యులు - ఇటు కృష్ణా జిల్లా కలెక్టర్ శాంతించలేదు. ఈ క్రమంలో జగన్ తతన ఎదురుగా ఉన్న కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ... తనకు సమీపంలో ఉన్న ఆయనపై చేయి వేసి మాట్లాడారు. ఆ రోజు సాయంత్రం దాకా ఈ వ్యవహారంలో ఎలాంటి తప్పు కనిపించకపోగా... మరునాడు ఉదయాని కంతా ఓ హైడ్రామాకు తెర లేసింది.
జిల్లా కలెక్టర్‌పై చేయి వేసి మాట్లాడమేమిటి?... జైలుకు పంపిస్తామని బెదిరించడం ఏమిటి? అని కూడా ప్రశ్నాస్త్రాలు దూసుకువచ్చాయి. దీనిపై నిన్న అమరావతిలోని తాత్కాలిక సచివాలయంలో ఐఏఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే సమయంలో నిన్న కర్నూలు పర్యటనకు వచ్చిన రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడుగానే కాకుండా కొత్తగా ఏర్పాటైన ఏపీ జేఏసీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన బొప్పరాజు వెంకటేశ్వర్లు కూడా జగన్ వైఖరిని తప్పుబట్టారు. ఉద్యోగుల్లో నైతిక స్థైర్యం దెబ్బతినేలా జగన్ వ్యవహరించారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవప్రదమైన పదవుల్లో ఉన్న వారు ఉద్యోగుల భుజం తట్టి ఉద్యోగులను ప్రోత్సహించాల్సింది పోయి అధికారుల మనోధైర్యం దెబ్బతినేలా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు.
మరి ఇదే బొప్పరాజు... కృష్ణా జిల్లాకు చెందిన తమశీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన సందర్భంగా వ్యవహరించిన తీరును పలువురు ప్రశ్నిస్తున్నారు. తహశీల్దార్‌గా ఉన్న వనజాక్షిపై దాడి జరిగితే... రెవెన్యూ సర్వీసెస్‌కు చెందిన ఆమెకు అండగా నిలవాల్సిన బాధ్యత ఆ అసోసియేషన్ అధ్యక్షుడిగా బొప్పరాజుపైనే ఉందన్నది కాదలలేని సత్యం. అయితే చింతమనేనిపై యుద్ధం ప్రారంభించామని ప్రకటించిన బొప్పరాజు... ఆ తర్వాత అడ్రెస్ లేకుండా పోయారు. తప్పుచేసినా చింతమనేని ఎక్కడ కూడా తగ్గకపోవడం, తనపై దాడి జరగలేదన్న రీతిలో వనజాక్షసి నుంచి బలవంతంగా వాంగ్మూలం తీసుకోవడం తదితరాలను రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో బొప్పరాజుకు తెలియవా? మరి నాడు వనజాక్షిపై చింతమనేని చేసింది దౌర్జన్యం కాదా? మరి నాడు బొప్పరాజు ఈ తరహాలో ఎందుకు పోరాడలేదు అంటూ పలు వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/