జగన్ వైసీపీకి అధినేత. ఆయన వ్యవహారశైలి చాలా డిఫరెంట్ గా ఉంటుందని పార్టీ నాయకులు చెబుతారు. ఎవరు ఎంత పెద్ద నాయకులుగా ఉన్న జగన్ వద్ద ఉన్నపుడు టోటల్ బాడీ లాంగ్వేజ్ ని చేంజి చేస్తారని, ఒక విధంగా వినయంగా విధేయతతో ఉంటారని చెబుతారు. జగన్ సైతం తన ఎదుట ఉన్న నాయకుల బిహేవియర్ ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు అని కూడా అంటారు.
ఆయన బయటకు ఏమీ మాట్లాడరు కానీ అవతల వారి బాడీ లాంగ్వేజ్ ని బట్టి వారి మాటలను చేష్టలను బట్టి ఒక అభిప్రాయానికి వస్తారని అంటారు. ఆ మీదట వారిని దగ్గరకు తీయడమా దూరం పెట్టడమా అన్నది ఆయన జడ్జి చేస్తారని కూడా బయట ప్రచారంలో ఉన్న మాట.
అయితే జగన్ తీసుకున్న నిర్ణయం ఒక్కోసారి తప్పుగా అనిపించినా ఆయన తన మటుకు తాను కరెక్ట్ అనుకుని ముందుకు సాగిపోతారు. ఈ విషయంలో తాను ఇబ్బంది పడినా లేదా పార్టీ పడినా కూడా ఆయన బే ఫికర్ గా ఉంటారని బయట ఉన్న ప్రచారం. ఇందులో నిజమెంత ఉంది అన్నది ఎవరికీ తెలియదు కానీ బయట చెప్పుకునే మాట మాత్రం ఇదె.
ఒక వేళ ఈ ప్రచారంలో ఎంతో కొంత నిజం ఉంటే మాత్రం ఆయన ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చునే సత్తా ఉన్న వారిని ఏమనాలి. వారిని నిజంగా బహు మొనగాడు అనాల్సిందే. ఇపుడు అలాంటి మొనగాడుగా సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ నిలించారు అనుకోవాలి.
జగన్ తాడేపల్లిలో నిన్నటికి నిన్న ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం ప్రాంతీయ కో ఆర్డినేటర్స్, జిల్లాల అధ్యక్షులు. సీనియర్ నేతలతో సాగింది. ఈ సమావేశానికి దిగ్గజ నేతలు అంతా హాజరయ్యారు. వారిలో విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, సజ్జల రామక్రిష్ణారెడ్డి వంటి వారు ఉన్నారు.
అయితే ఈ అందరూ ముందు వరసలోనే కూర్చున్నారు. ఇక విజయనగరం శ్రీకాకుళం జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ కూడా సజ్జల పక్కన కూర్చున్నారు. అయితే ఆయన కాలి మీద కాలు వేసుకున్న తీరు మాత్రం కొంత ఆశ్చర్యంగా ఆసక్తికరంగానే ఉంది. బొత్స సీనియర్ లీడర్, పెద్ద మనిషి. వయసులో కూడా పెద్దవారు. అందులో రెండవ మాట లేదు.
కానీ వేదిక మీద ఉన్నది పార్టీ అధినాయకుడు, ముఖ్యమంత్రి పైగా నిక్కచ్చిగా ప్రతీ విషయంలో ఉండే జగన్. మరి ఆయన ముందు బొత్స ఇలా తన బాడీ లాంగ్వేజ్ తో ఉన్నారు అంటే అది చాలా ఇంటెరెస్టింగ్ ఫోటోగానే చూడాలి. అయితే దీని వల్ల వైసీపీలో కానీ బొత్సకు కానీ ఏమీ అయిపోయిందని కాదు కానీ బొత్స తన సహజ పద్ధతిలోనే అలా కూర్చున్నారు అనే చెబుతున్నారు.
ఇక జగన్ సైతం బొత్సకు విలువ గౌరవం ఇస్తారు. బొత్స టాలెంట్ ఏంటో జగన్ కి తెలుసు. సో జగన్ వద్ద ఉన్న చనువుతోనూ తన గురించి తనకు ఉన్న ధీమాతోనూ పైగా ముందే చెప్పుకున్నట్లుగా తన సహజ ధోరణితోనూ బొత్స అలా కాలు మీద కాలు వేశారు అనుకోవాలి. ఏది ఏమైనా ఈ ఫోటో మాత్రం ఇపుడు సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది. ఎవరికి తోచిన తీరున వారు నెటిజన్లు దీని మీద రియాక్ట్ అవుతున్నారు.