ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు బొత్స గుడ్ బై!?

Update: 2021-07-03 05:02 GMT
సీనియ‌ర్ నాయ‌కుడు, ఏపీ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు, ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్న బొత్స స‌త్య‌నారా యణ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్ప‌నున్నారా?  త్వ‌ర‌లోనే ఆయ‌న కీల‌క నిర్ణ‌యం తీసుకునేదిశ‌గా అడుగులు వేస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. ఉత్త‌రాంధ్ర ప్రాంతానికి చెందిన బొత్స‌.. విజ‌య‌న‌గ‌రం జిల్లాను శాసించే నేత‌గా గుర్తింపు పొందిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాం నుంచి బొత్స పొలిటిక‌ల్‌గా త‌న ఇమేజ్‌ను పెంచుకున్నారు. మంత్రిగా, కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఆయ‌న దూకుడు ప్ర‌ద‌ర్శించారు.

ప్ర‌ధానంగా విజ‌యన‌గ‌రంలో త‌న సామాజిక వ‌ర్గాన్ని ఏకీకృతం చేసి.. త‌న‌వైపు తిప్పుకోవ‌డంలో బొత్స ముందున్నార‌నే చెప్పాలి. ఇక‌, ఇప్పుడు.. గ‌డిచిన రెండేళ్లుగా వైఎస్ జ‌గ‌న్ కేబినెట్‌లో పుర‌పాల‌క శాఖ మంత్రిగా ఉన్న బొత్స‌.. అనేక విధాలుగా కీల‌క రోల్ పోషిస్తున్నారు. అయితే.. కొన్నాళ్లుగా ఆయ‌న మంత్రి వ‌ర్గంలోను, పార్టీలోనూ చురుగ్గా వ్య‌వ‌హ‌రించ‌లేక పోతున్నార‌నే వాద‌న ఉంది. అదేస‌మ‌యంలో మీడియాతోనూ ఏదో అన్న‌ట్టుగా మాట్లాడుతున్నారే త‌ప్ప మ‌నస్పూర్తిగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించ‌లేక పోతున్నార‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు.

ఇక‌, ఒక‌ప్పుడు రాష్ట్రంలో కీల‌క పాత్ర పోషించిన బొత్స‌.. ఇటీవ‌ల కాలంలో రాష్ట్రం మాట అటుంచితే.. జిల్లా స్థాయిలోనూ పెద్ద‌గా యాక్టివ్ పాలిటిక్స్ చేయ‌లేక‌పోతున్నార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.  దీనికి ప్ర‌ధానంగా.. బొత్స‌కు ఆరోగ్యం స‌హ‌క‌రించ‌డం లేద‌ని తెలుస్తోంది. దీంతో మంత్రిగా త‌న బాధ్య‌త‌ల‌ను కూడా తాను నిర్వ‌ర్తించలేక పోతున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపాలంటూ.. వైసీపీఅధినేత‌, సీఎం జ‌గ‌న్ వ‌ద్ద కూడా అభ్య‌ర్థించిన‌ట్టు తెలుస్తోంది. దీనికి ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించార‌ని స‌మాచారం.

ప్ర‌స్తుతం 65 ఏళ్ల వ‌య‌సున్న బొత్స‌.. రాజ్య‌స‌భ‌లో అడుగు పెడితే.. ఆరేళ్ల‌పాటు ప్ర‌శాంతంగా గ‌డిచిపోవ‌డం ఖాయ‌మ‌ని.. భావిస్తున్నారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. పూర్తిగా రాజ‌కీయాల‌కు దూరంగా జీవితాన్ని గ‌డ‌ప‌వ‌చ్చ‌ని అనుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే.. ఉత్త‌రాంధ్ర‌లో బొత్స కుటుంబం రాజ‌కీయంగా పుంజుకుంటోంది. ఈ క్ర‌మంలో బొత్స రాజ్య‌స‌భ‌కు వెళ్తే.. ఈ కుటుంబానికి మ‌రింత ప్రాధాన్యం ద‌క్కే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. పెన్మ‌త్స సాంబ‌శివ‌రాజు నేతృత్వంలో రాజ‌కీయ అరంగేట్రం చేసిన బొత్స‌.. మూడు ద‌శాబ్దాలుగా ఉత్త‌రాంద్ర‌లో త‌న‌దైన ముద్ర వేశారు. పార్ల‌మెంటు స‌భ్యుడిగా, మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షుడిగా.. ప‌ద‌వులు అలంక‌రించారు.
Tags:    

Similar News