16 లక్షల కుటుంబాల భవిష్యత్ ను ఓ వైపు అంధకారమయం చేస్తూ మరోవైపు తన అవినీతి సంపాదనను లక్షల కోట్లకు పెంచుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎత్తుగడ వేశారని వైఎస్ ఆర్ సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ప్రత్యేక హోదా ముసుగులో ఢిల్లీ పర్యటనకు వెళ్లి చంద్రబాబు అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు చీకటి ఒప్పందాలు చేసుకున్నారని విమర్శించారు. మొదట ఆ సంస్థ పేరు అగ్రిగోల్డ్ అని అదిప్పుడు బాబు గోల్డ్ గా మారిపోయిందని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. పబ్లిసిటీ కోసం పుష్కరాల్లో వేల కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు రూ. 11 వందల కోట్లు ఇచ్చి 16 లక్షల కుటుంబాలను ఆదుకోలేరా.. అని ప్రశ్నించారు.
హోదా కోసం జాతీయ నాయకులందరినీ సమీకరిస్తానని చెప్పిన చంద్రబాబు.. ఎవరికీ తెలియకుండా మాజీ ఎంపీ అమర్ సింగ్ ను కలిసి రహస్య ఒప్పందాలు చేసుకున్నారని బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ నెల 3వ తేదీన రాత్రి 10 గంటలకు ఎవరికీ తెలియకుండా చంద్రబాబు అగ్రిగోల్డ్ ను హైకోర్టులో టేకోవర్ చేస్తామన్న జీఎస్సెల్ సంస్థ యజమాని సుభాష్ చంద్ర - మాజీ ఎంపీ అమర్ సింగ్ - వీరితో పాటు అగ్రిగోల్డ్ కు సంబంధించి ప్రముఖ న్యాయవాది ముగ్గురితో సమావేశమయ్యారని బొత్స చెప్పారు. చంద్రబాబును కలిసిన రెండ్రోజులకే జీఎస్సెల్ సంస్థ యాజమాన్యం అగ్రిగోల్డ్ ఆస్తులు విక్రయించలేమని అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. ఆస్తులకంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయంటూ కొత్త పల్లవి అందుకుందన్నారు. అగ్రిగోల్డ్ అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు జీఎస్సెల్ కంపెనీతో మీరు ఎందుకు చర్చించారు చంద్రబాబూ అని ప్రశ్నించారు. మొదట్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులున్నాయని చెప్పిన కంపెనీ ఇప్పుడు ఎందుకు రూ. 4 వేల కోట్లు అని చెబుతుందని నిలదీశారు. చీకటి ఒప్పందాల్లో వాటాలు కుదరకపోయే సరికి వారు అఫిడవిట్ దాఖలు చేసింది వాస్తవమా.. కాదా..? చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చెప్పకపోతే వివరాలు మేము బయటపెడతామని హెచ్చరించారు.
ప్రణాళిక సంఘం అధ్యక్షుడు కుటుంబరావు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారని బొత్స ఆరోపించారు. చంద్రబాబు బినామీలా మాట్లాడితే.. దానికి సమాధానం చెబుతామన్నారు. ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా ఉండి.. ప్రభుత్వానికి ఒత్తాసుగా ఉండడమేనా మీ బాధ్యత అని ప్రశ్నించారు. జీఎస్సెల్ సంస్థ ఎందుకు వెనుకంజ వేసిందో చెప్పాలన్నారు. హాయ్ ల్యాండ్ - విశాఖ పట్నంలోని బీచ్ రిసార్ట్స్ - విలువైన భూములు అవన్నీ చంద్రబాబు దక్కించుకోవాలని దుర్బుద్ధితో బాధితులకు అన్యాయం చేస్తున్నారని బొత్స ఆరోపించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను మంత్రులు అప్పనంగా కాజేశారని అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సాక్షాలతో సహా బయటపెట్టారన్నారు. వైయస్ జగన్ మాటగా అగ్రిగోల్డ్ బాధితులకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఈ దోపిడీ ప్రభుత్వం మెడలు వంచైనా డబ్బు ఇప్పిస్తామన్నారు. లేదా వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
చంద్రబాబు సింగపూర్ కు ఎందుకు వెళ్లారో అది కూడా రెండ్రోజుల్లో బయటపెడతామని బొత్స సత్యనారాయణ అన్నారు. ఏ వ్యాపారాల కోసం చంద్రబాబు వెళ్లారో.. బాబు సొంత వ్యాపారాలు ఏంటో.. అన్ని బయటకు తీసుకువస్తామన్నారు. ఇంత వరకు ఎక్కడెక్కడ దాపరికాలు చేశారో.. అన్ని లెక్కలు ఉన్నాయన్నారు. దేవుడి గుడి వెనకాల ఉండి పవిత్రుడినని చెప్పుకుంటే కుదరదని.. ప్రవర్తనను బట్టి వ్యక్తిత్వం తెలిసిపోతుందన్నారు. చీకటి ఒప్పుందాలు చేసుకుంటూ 16 లక్షల కుటుంబాలతో ఆటలాడుతారా.. వారి కష్టాలు చూసి సంబరాలు చేసుకుంటారా.. అని మండిపడ్డారు. ఇదేనా చంద్రబాబు మీ 40 సంవత్సరాల అనుభవం అని ప్రశ్నించారు.