నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారంటూ వినిపిస్తున్న పుకార్ల పై ఇప్పుడు ఏపీలో పెద్ద చర్చే నడుస్తోంది. ఈ చర్చకు ఎప్పుడు శుభం కార్డు పడుతుందన్న విషయాన్ని పక్కనపెడితే... రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు నిన్న రాజధానిలోనే ఆందోళనకు దిగిన వైనం ఈ చర్చను మరింత వేడెక్కించిందనే చెప్పాలి. అసలు రైతులు ఎందుకు నిరసనకు దిగారన్న విషయంపై ఎవరికి తగిన కారణాలను వారు చెప్పుకుంటున్నారు. అయితే రైతులు ఆందోళనకు దిగిన కారణం మాత్రం ఇదేనంటూ రాజధాని వివాదాన్ని రేపిన మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అంతేకాకుండా రైతులు ఎందుకు ఆందోళన చేశారో తమకు తెలుసని, వారి ఆందోళనను తగ్గించేలా త్వరలోనే చర్యలు చేేపడతామని కూడా బొత్స చేసిన వ్యాఖ్యలు నిజంగానే ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నారన్న వార్తలతో భయాందోళనలకు గురైన రైతులు... రాజధానిని ఇక్కడి నుంచి తరలించరాదన్న డిమాండ్ తోనే ఆందోళనకు దిగారన్నది టీడీపీ నేతలు - టీడీపీ అనుకూల మీడియా వాదన.
అయితే బొత్స వాదన ప్రకారం... రాజధాని నిర్మాణం కోసం తాము భూములిస్తే... తమకు ఏటా కౌలు చెల్లిస్తామంటూ చంద్రబాబు సర్కారు ఒప్పందం చేసుకుంది కదా... ఆ కౌలు కోసమే ఇప్పుడు రైతులు ఆందోళనకు దిగారట. రైతులు ఎంతమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాజధాని రైతులకు కౌలు చెల్లించాలని ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని, త్వరలోనే కౌలు మొత్తాలను చెల్లిస్తామని బొత్స చెప్పుకొచ్చారు. మొత్తంగా నిన్న రాజధాని రైతుల ఆందోళనపై పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చకు బొత్స ఫుల్ స్టాప్ పెట్టారన్న వాదన వ్యక్తమవుతోంది.