ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత - అధికార ప్రతినిధి బొత్స సత్య నారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమ్మోరి ముందూ అబద్ధాలానే బాబూ అంటూ ఓ రేంజ్‌లో ఎక్కిదిగారు. ``నీ కళ్లే దుష్టకళ్లు. నీ ఆలోచనే దుష్ట ఆలోచన` అంటూ తిట్ల వర్షం కురిపించారు. నిన్న సీఎం చంద్రబాబు బెజవాడ కనకదుర్గ ఆలయానికి భార్య భువనేశ్వరి సహా.. వెళ్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాన విపక్షం వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
తానెంతగానో ప్రాధాన్యం ఇస్తున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో దుష్టుల చూపు పడకుండా చూడాలని అమ్మవారిని ప్రార్థించినట్టు సీఎం చెప్పారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే తీవ్ర కలకలం రేపుతున్నాయి. వైసీపీ నేత బొత్స ఈ వ్యాఖ్యలపైనే మండిపడ్డారు. ప్రభుత్వం పండుగలు - పబ్బాలను కూడా రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుపై దుష్టశక్తుల కన్ను పడిందని దుర్గాదేవి సన్నిధిలో చంద్రబాబు వ్యాఖ్యానించడం శోచనీయం అన్నారు. పోలవరానికి శంకుస్థాపన చేసిందెవరని? కుడి -ఎడమ కాలువలను కట్టిందెవరో చెప్పాలని డిమాండ్ చేశారు.
దుర్గాదేవి సన్నిధిలో ఆబద్ధాలు చెప్పడానికి చంద్రబాబుకు నోరెలా వచ్చిందని ధ్వజమెత్తారు. కేంద్రంలో భాగస్వామ్యులుగా ఉన్నబీజేపీ - టీడీపీలు పోలవరం నిర్మాణంలో ఎందుకు జాప్యం చేస్తున్నారో చెప్పాలన్నారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు కామధేనువుగా చూస్తున్నారని, రూ.16 వేల కోట్ల ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం రూ.57 వేల కోట్లకు పెంచడం వెనుక ఆంతర్యమేమిటో ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు. దుష్ట ఆలోచనల నుంచి చంద్రబాబును ఆ దుర్గామాతే బయటకు తీసుకురావాలన్నారు. రాష్ట్రంపై దుష్టశక్తుల కళ్లు పడకుండా ఉండాలని కోరుతున్నామని, దేవుళ్లను కూడా రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లిందని అన్నారు. కాగా, తెలుగు ప్రజలందరకీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున బొత్స విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.