రౌడీల తోడు లేకుంటే..చంద్రబాబుకు భయమా?

Update: 2018-01-04 12:57 GMT
సాధారణంగా పార్టీ మీద లేదా ప్రభుత్వం మీద పూర్తిగా అదుపు - పట్టు ఉన్న నాయకుడు అయితే.. ఆయన సమక్షంలో అందరూ చక్కటి క్రమశిక్షణతో మాత్రమే మెలగాలి. ఆయన కనుసన్నల్లో నడుచుకోవాలి. ఆయన మాట మీరకుండా.. ఆయనకు గౌరవం ఇస్తూ ఆయన ఎలా చెబితే అలా నడుచుకోవాలి. కానీ.. బుధవారం నాడు వివాదాస్పదంగా పులివెందులలో జరిగిన జన్మభూమి బహిరంగసభలో అలాంటి వాతావరణం మాత్రం కనిపించలేదు. చంద్రబాబు మాటలతో నిమిత్తం లేకుండా.. వేదికమీద ఉన్న వ్యక్తులు రౌడీల్లాగా చెలరేగిపోయారు.. అని ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారు.

‘‘ఇంతకూ జన్మభూమి కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమం అని ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన వేదిక మీద రౌడీలను ఎందుకు పెట్టుకున్నట్లు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ నిలదీసే వరకూ ఈ కోణంలో జనం కూడా ఆలోచించలేదేమో అనిపిస్తోంది. ఎందుకంటే.. చంద్రబాబునాయుడు కార్యక్రమంలో ఆయన ప్రోటోకాల్ పద్ధతులతో నిమిత్తం లేకుండా.. స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డికి తొలి అవకాశం ఇవ్వకుండా.. ముందుగా తానే మాట్లాడేశారు. ఆ తరువాత.. ఎంపీ అవినాష్ రెడ్డికి మైకు ఇచ్చారు. అసలు కడపజిల్లాకు నీళ్లు రావడానికి 85 శాతం పనులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే జరిగాయని అవినాష్ రెడ్డి వాస్తవాలను ప్రకటించే ప్రయత్నం చేశారు. ఇది సాగుతుండగా.. చంద్రబాబు కూడా ఒక దశ వరకు వేదిక మీద మౌనంగా కూర్చునే ఉన్నారు గానీ.. అదే వేదిక మీద ఉన్న ఆయన తైనాతీ - పచ్చ చొక్కాల వ్యక్తులు రౌడీల్లాగా విరుచుకుపడ్డారనేది ఇప్పుడు వైసీపీ చేస్తున్న ఆరోపణ. చంద్రబాబుకంటె ముందు పచ్చచొక్కాల వ్యక్తులు అవినాష్ రెడ్డి మీద పడినంత పనిచేస్తూ.. ఆయన చేతిలోని మైకును లాక్కోడానికి ప్రయత్నించారు. అసలే.. వైఎస్ ను దేవుడిగా భావించే ప్రజలున్న పులివెందుల.. అక్కడ వైఎస్ అవినాష్ రెడ్డికి అవమానం జరిగితే తన రౌడీలు  - పోలీసులు కాపాడలేని పరిస్థితి ఉత్పన్నం అవుతుందని భయపడ్డారేమో చంద్రబాబు జోక్యం చేసుకుని.. నిప్పులు చెరిగి మైక్ కట్ చేయించి.. అప్పటికి గండం దాటారు.

అయినా.. ప్రభుత్వ కార్యక్రమాల పేరు చెప్పి.. ఇలాంటి రౌడీలను వేదికల మీదికి తీసుకువెళ్లడం ఎక్కడి చట్టం - న్యాయం అంటూ ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. చంద్రబాబు చెబితే ప్రభుత్వ కార్యక్రమం అనుకోవాల్సిందే తప్ప.. ఇది అచ్చంగా పార్టీ కార్యక్రమం లాగానే సాగుతున్నదని జనం కూడా మెటికలు విరుస్తున్నారు.

Tags:    

Similar News