వైసీపీ జాతీయ ప్లీనరీ సమావేశాలు విజయవంతం కావడంతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పండుగలా జరిగిన ప్లీనరీకి వచ్చిన ఆదరణను ప్రపంచమంతా చూసిందని ఆయన చెప్పారు. అది ఓర్వలేక టీడీపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు.
అన్ని వర్గాలకు భరోసా ఇచ్చేలా కార్యకర్తలందరితో చర్చించి ప్లీనరీలో నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని, ఇప్పుడు వైఎస్ జగన్ కూడా అన్ని హామీలను అమలు చేసి చూపిస్తారని బొత్స చెప్పారు. జగన్ సీఎం అయితే రాజధానిని వేరే చోటికి మారుస్తారని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అమరావతిని దేశంలోనే మేటి రాజధానిగా చేయాలనేది వైసీపీ లక్ష్యమన్నారు.
కేవలం ప్రతిపక్షాన్ని తిట్టడానికే అన్నరీతిలో టీడీపీ మహానాడు నిర్వహించిందన్నారు. ప్రజలకు కావలసిన అంశాలను తాము ప్లీనరీలో చర్చించామన్నారు. ప్లీనరీ గ్రాండ్ సక్సెస్ కావడంతో టీడీపీ నేతలకు భయం పట్టుకుందని బొత్స వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయింది చంద్రబాబేనని, జైలుకు వెళ్లాల్సి వస్తే ఆయనే వెళ్లాలని అన్నారు.
కాగా, వైసీపీ జాతీయ ప్లీనరీపై చర్చించడానికి, విమర్శించడానికి చంద్రబాబు ప్రభుత్వానికి అర్హత లేదని వైసీపీ నేత మేరుగ నాగార్జున మండిపడ్డారు. మూడంచెల్లో ప్లీనరీకి ప్రణాళిక రచించిన జగన్ గొప్పదార్శనీకుడన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబు సర్కార్ తమ విమర్శలకు భయపడుతోందన్నారు.
దేవీనేని ఉమ - జవహర్ ఏ అర్హతతో మాట్లాడుతున్నారని నాగార్జున ప్రశ్నించారు. దళితులను వెలివేస్తే మాట్లాడని జవహర్ ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉమా అవినీతి గురించి ప్రతిఒక్కరికీ తెలుసన్నారు. వైఎస్ జగన్ పై అవాకులు, చవాకులు ఆపి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని, విజయవాడ నడిబొడ్డున తేల్చుకుందామని సవాల్ విసిరారు. త్వరలోనే టీడీపీ రథచక్రాలు ఊడగొట్టి పడగొడతామన్నారు.