టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కామెంట్లను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపుల విషయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏమీ చేయలేరని, ఆయన అధికారాలు నామమాత్రమేనని వ్యాఖ్యలు చేయడం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అవగాహనకు నిదర్శనమన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి నిర్ణయం రాష్ట్రపతి ఆమోద ముద్రతోనే చట్టబద్దత పొందుతుందనే చిన్న లాజిక్ జేసీకి తెలియదా? అని ప్రశ్నించారు. లేకపోతే రాష్ట్రపతి పదవిని ప్రభావితం చేయగలరని భావిస్తున్నారా అని నిలదీశారు. గతంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ రాష్ట్రపతి పదవిలో ఉన్నవారిని చంద్రబాబు కలిసిన విషయం గుర్తుకు రావడం లేదా అని బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. కనీసం తాను ఉన్న పార్టీలో ఏం జరిగిందో తెలియక జేసీ నవ్వుల పాలు అవుతున్నారని బొత్స ఎద్దేవా చేశారు.
ప్రజాస్వామ్యం అంటే ఎలాంటి గౌరవం లేని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు బాటలోనే ఆయన పార్టీ నేతలు నడుస్తున్నారని బొత్సా సత్యనారాయణ మండిపడ్డారు. గవర్నర్, ముఖ్యమంత్రి, స్పీకర్ వ్యవస్థలతో పాటు రాజ్యాంగాన్ని కూడా చంద్రబాబు అపహాస్యం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఉద్దేశించి టీడీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని బొత్సా సత్యనారయణ అన్నారు. టీడీపీ ఎంపీలు పార్లమెంట్ వ్యవస్థకు కళంకం తెస్తున్నారని, జేసీ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించడం లేదని బొత్స సూటిగా ప్రశ్నించారు. ఏపీలో నిస్సిగ్గుగా జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని, స్పీకర్ల అధికారాలకు పరిమితి ఉండాలని బొత్స అన్నారు. అదే విషయాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని పార్టీల దృష్టికి తీసుకువెళ్తున్నారన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/