బొత్స‌... బాబు - ప‌వ‌న్‌ ల‌ను మ‌డ‌త‌పెట్టేశారే!

Update: 2018-01-28 11:38 GMT
ఏపీలో అధికార పార్టీ టీడీపీ - ఆ పార్టీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి అధికారం చేజిక్క‌డంలో కీల‌క భూమిక పోషించార‌ని భావిస్తున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌ను వైసీపీ సీనియ‌ర్ నేత‌ - మాజీ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ నిజంగానే మ‌డ‌త‌పెట్టేశార‌నే చెప్పాలి. నేటి మ‌ధ్యాహ్నం విశాఖ‌ప‌ట్నంలో మీడియా ముందుకు వ‌చ్చిన బొత్స‌.. చంద్ర‌బాబుతో పాటుగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌పైనా త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. ప్ర‌స్తుతం ఏపీలో బీజేపీ - టీడీపీల మ‌ధ్య కొన‌సాగుతున్న పొత్తు - దానికి సంబంధించి ఇరు పార్టీల నేత‌ల నోట వినిపిస్తున్న మాట‌లు... నిన్న‌టికి నిన్న చంద్ర‌బాబు స్వ‌యంగా ఈ వ్వ‌వ‌హారంపై చేసిన సంచ‌ల‌న కామెంట్ల‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. అదే స‌మ‌యంలో ఏపీకి న్యాయంగా ద‌క్కాల్సిన ప్ర‌త్యేక హోదా - ప్ర‌త్యేక రైల్వే జోన్ల‌పైనా చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తంలో సినీ న‌టుడు శివాజీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌త్యేకంగా ప్ర‌జా ఉద్య‌మం సాగగా... మొన్న గుంటూరు కేంద్రంగా ఇంకో ప్ర‌జా ఉద్య‌మం మొద‌లైపోయింది.

అంతేకాకుండా గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగి ఇప్ప‌టికే నాలుగేళ్లు పూర్త‌వుతోంది. మ‌రో ఏడాదిలో 2019 ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఏడాది స‌మ‌యంలోనైనా ఏపీకి ద‌క్కాల్సిన ప్ర‌త్యేక హోదా - రైల్వే జోన్ల‌ను సాధించే దిశ‌గా ఆయా రాజ‌కీయ పార్టీలు వ్యూహాలు ర‌చిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ మొత్తం వ్య‌వ‌హారాలపై ఇప్పుడు ఆసక్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. దీనిపై త‌న‌దైన రీతిలో స్పందించేందుకు నేటి మ‌ధ్యాహ్నం విశాఖ‌లో మీడియా ముందుకు వ‌చ్చిన బొత్స‌... అటు చంద్ర‌బాబుతో పాటుగా ఇటు ప‌వ‌న్‌పైనా త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. ఇప్ప‌టిదాకా రాష్ట్రానికి ద‌క్కాల్సిన ప్ర‌త్యేక హోదా - రైల్వే జోన్ల‌పై చంద్ర‌బాబు - ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏ త‌ర‌హా రాజ‌కీయాలు న‌డిపార‌న్న అంశాన్ని ప్ర‌స్తావించిన బొత్స‌... అస‌లు రాష్ట్రంలో చంద్రబాబు ప్ర‌భుత్వం ఏ త‌ర‌హా పాల‌న సాగిస్తుంద‌న్న అంశంపైనా నిప్పులు చెరిగారు.

రాష్ట్రంలో అవినీతి పాల‌న సాగిస్తున్న చంద్ర‌బాబు స‌ర్కారుపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ఫిర్యాదు చేస్తామ‌న్న బొత్స... ఆ దిశ‌గా ఈ నెల 31న ప్ర‌ధానికి లేఖ రాస్తామ‌ని చెప్పారు. అయినా చంద్ర‌బాబు - ప‌వ‌న్‌ ల‌పై బొత్స ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... *ఉత్త‌రాంధ్ర‌లో జ‌రుగుతున్న అవినీతిపై ఈ నెల 31న ప్ర‌ధానికి లేఖ రాస్తాం. చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌లు - పెట్టుబ‌డుల‌పై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాలి. ప్ర‌త్యేక హోదా - రైల్వే జో్న్ లాంటి విభ‌జ‌న హామీల‌ను ఎవ‌రు నెర‌వేరిస్తే ఎన్నిక‌ల త‌ర్వాత‌ వారికే మా మ‌ద్ద‌తు. నాలుగేళ్ల పాటు పొత్తులో ఉండి... ఇప్పుడు బీజేపీకి న‌మ‌స్కారం అన‌డం స‌రికాదు. ప్ర‌త్యేక హోదాపై హ‌డావిడి చేసిన ప‌వ‌న్‌... ఇప్పుడెందుకు మాట్లాడ‌టం లేదు. ఎంపీల రాజీనామాల‌పై క‌ట్టుబ‌డి ఉన్నాం* అని బొత్స పేర్కొన్నారు.
Tags:    

Similar News