ఏపీ సీఎం చంద్రబాబు డాబులపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎక్కడ ఏం జరిగినా ఆ ఘనత తనదే అంటున్నారని... హైదరాబాద్ కు మెట్రో రైలు కూడా తానే తెచ్చానని చంద్రబాబు చెప్పడం నవ్వు తెప్పిస్తోందని ఆయన అన్నారు. చూడబోతే విశాఖకు సముద్రాన్ని కూడా తానే తెచ్చానని ఆయన చెప్తారేమో అని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు కూడా చంద్రబాబు వల్లేమీ రాలేదని.. ఆ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు తెచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని - భూ సేకరణ మొదలుపెట్టింది కూడా ఆయనేనని బొత్స అన్నారు.
ఇప్పుడు ఏపీకి జీవనాధారం లాంటి పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు అయోమయంలో పడేస్తున్నారని ఆరోపించారు. తన స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆయన ధ్వజమెత్తారు. సీఎం చర్యలు రాష్ట్రానికి నష్టం కలిగించేలా ఉన్నాయని మండిపడ్డారు. పోలవరాన్ని తామే కడతామని కేంద్రం చెప్పినా సహకరించకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుపడిందని.. పోలవరం నిర్మాణంలో బాబు అవినీతికి పాల్పడుతున్నారనే ప్రస్తుతం నిధులు ఇవ్వలేమని కేంద్రం అంటోందని అన్నారు.
పోలవరాన్ని నిర్మిస్తామని కేంద్రం చెప్పినా వినకుండా ఆ బాధ్యత ఎందుకు తీసుకున్నారు... పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారు అంటూ చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రత్యేక హోదా ఏమైంది. గిరిజన వర్సిటీ ఏమైంది? మీరిచ్చిన మిగతా హామీలేమయ్యాయి అంటూ ఏకిపడేశారు. రాష్ఱ్టాన్ని ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలోకి నెట్టేశారని ఆయన ఆరోపించారు.