వైసీపీకి పెద్ద దిక్కుగా విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక వైపు ఉన్నారు. అదే టీడీపీకి ఈ మధ్యనే రాజకీయంగా రీ యాక్టివ్ అయిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఈ ఇద్దరూ పాతకాపులే. ఇద్దరూ కాంగ్రెస్ లో పనిచేసిన వారే.
కాంగ్రెస్ నుంచి వైసీపీకి బొత్స సత్యనారాయణ వస్తే తెలుగుదేశం నుంచి అన్ని పార్టీలూ చుట్టేసి తిరిగి టీడీపీలో సెటిల్ అయిన వారు గంటా శ్రీనివాసరావు. తెలుగుదేశం ప్రభుత్వంలో గంటా చూసిన మానవ వనరుల శాఖనే ఇపుడు బొత్స చూస్తున్నారు.
ఈ ఇద్దరూ తమ పార్టీల తరఫున వకాల్తా పుచ్చుకుని మరీ గట్టిగానే మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్రా అభివృద్ధి చెందుతూంటే చంద్రబాబుకు ఎందుకు కడుపు మంట అని బొత్స సూటిగా నిలదీశారు. అత్యంత వెనకబడిన ఉత్తరాంధ్రా ప్రాంతాలు బాగుపడడం బాబుకు ఇష్టం ఉండదా అని ఆయన మండిపడుతున్నారు.
గతంలో తాను భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేశాను అని చంద్రబాబు అంటున్నారు మరి ఆనాటి కేంద్ర పౌర విమాన యాన మంత్రి టీడీపీకే చెందిన అశోక్ గజపతిరాజు ఆ శంకుస్థాపన కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదని లాజిక్ పాయింట్ తీశారు. ఏ అనుమతులు లేకుండా నాడు తూతూ మంత్రంగా టెంకాయ కొట్టారని అంటున్నారు. అందుకే ఎవరూ దాన్ని పట్టించుకోలేదని అన్నారు
భోగాపురం ఎయిర్ పోర్టుకు అయిదు వేల ఎకరాలను తీసుకుని రైతుల పొట్ట కొట్టాలని చూస్తే జగన్ చేసిన పోరాటం వల్లనే అది 2,300 ఎకరాలకు కుదించారని అన్నారు. తమ ప్రభుత్వం రైతులకు మేలు చేసిందని, వారి ప్రయోజనాలను కాపాడిందని అన్నారు. ఉత్తరాంధ్రాకు తలమానికం భోగాపురం ఎయిర్ పోర్టు అని బొత్స కితాబు ఇచ్చారు అభ్హివృద్ధి అంటే ఏంటో జగన్ ఈ ప్రాంతానికి చూపిస్తున్నారని ఆయన కొనియాడారు.
సరిగ్గా ఈ పాయింట్ మీదనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉత్తరాంధ్రాకు టీడీపీ వైసీపీ ప్రభుతాలలో ఎవరెంత చేశారో చర్చకు సిద్ధమా అని వైసీపీకి సవాల్ విసిరారు. అసలు ఉత్తరాంధ్రాకు గడచిన నాలుగేళ్ళ కాలంలో ఏ మేలు చేశారో ఒక శ్వేత పత్రం రిలీజ్ చేస్తే తామూ చూస్తామని అన్నారు
ఉత్త మాటలు తప్ప ఏమీ ఈ ప్రాంతానికి చేయలేదని, నాలుగేళ్ల పుణ్య కాలం గడిపేసి ఇపుడు తాపీగా వచ్చి తమ ప్రభుత్వం శంకుస్థాపనలు చేసిన వాటినే మరోసారి చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు.
ఇక విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించి రెండు నెలలు అయిందని, దాని మీద రివ్యూ ఇప్పటివరకూ ఎందుకు చేయలేదని ఆయన నిలదీశారు. వైసీపీ నేతలు అభివృద్ధి చెప్పుకునేందుకు ఏమీ లేకనే ఇలా తమ మీద విమర్శలు చేస్తునారు అని అంటున్నారు. మొత్తానికి అటు బొత్స ఇటు గంటా బిగ్ సౌండ్ చేస్తున్నారు. ఉత్తరాంధ్రా నుంచి ఆయా పార్టీల తరఫున ఈ సీనియర్లు ముందుకు వచ్చి దూకుడు చేస్తున్నారు.
నిజంగా ఉత్తరాంధ్రాకు ఎంత మేలు జరిగింది. ఏమిటి అన్నవి ప్రజలకు తెలుసు. ఏ ప్రభుత్వం ఉన్నా అభివృద్ధి చేయడానికే చూస్తుంది. అయితే ఇందులో రాజకీయ వాటాలను తేల్చుకోవడానికే నేతలు సవాళ్ళు చేస్తున్నారు అని అంటున్నారు ఇక గంటా బొత్స నిజంగా ఉత్తరాంధ్రా అభివృద్ధి మీద డిబేట్ పెడితే పూర్తిగా వాస్తవాలు జనాలకు తెలుస్తాయి కదా అని అంటున్న వారూ ఉన్నారు. కానీ ఇది రాజకీయం కాబట్టి అలాంటి సన్నివేశాన్ని ఆశించలేమనే చెప్పాలి.