ఇందులో నీళ్లు తాగారంటే.. మీకు అదో తుత్తి

Update: 2015-11-08 04:52 GMT
సగటు మనిషిని కాలుష్యం బారిన పడకుండా చేయడంతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడటంలో తోడ్పడే లక్ష్యంతో, పర్యావరణ పరిరక్షక వినియోగదారీ ఉత్పత్తులను తయారు చేస్తున్న నిర్వాణ బీయింగ్ కంపెనీ మనం తాగుతుండగానే నీటిని శుద్ధి చేసే బాటిల్‌‌ ని మార్కెట్ లో ప్రవేశపెట్టింది. రూ. 550 మిల్లీ లీటర్ల నీరు పట్టే ఈ బాటల్ బబుల్ ధర రూ. 950. నీటిని శుద్ది చేసి దానికి రుచి కలిగించే కార్బన్ ఫిల్టర్‌ ను ఇది ఉపయోగిస్తుంది.

నిర్వాణ బీయింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు జై ధార్ గుప్తా ఈ విశిష్ట ఉత్పత్తి గురించి మీడియాకు వివరించారు. మునిసిపల్ కుళాయి నుంచి వచ్చే నీరు తాగడానికి పనికొస్తుంది కానీ దాని రుచి బాగా లేనందుకు మనలో చాలామంది ఆ నీటిని తాగలేమని పైగా ఆ నీటిలో రసాయనాలు - క్లోరిన్ కలిసి ఉంటాయని గుప్తా చెప్పారు. తమ సంస్థ రూపొందించిన ఈ ఫిల్టర్ (అటే బాటిల్ బబుల్‌ లోని క్రియాత్మక కార్బన్ ఫిల్టర్) నీటిలోని రసాయనాలు, మలినాలు, క్లోరిన్ వంటి వాటిని పూర్తిగా తొలగించి పరిశుద్దమైన నీటిన మంచి రుచితో ఉన్న నీటిని అందిస్తుందని తెలిపారు.

పూర్తిగా రి సైకిల్ పదార్థాలతోనే తయారు చేయబడిన ఈ వాటర్ బబుల్ 300 సార్లు నీటిని శుద్ధి చేస్తుందని, తర్వాత రూ. 450లతో ఫిల్టర్‌ ని మార్చుకోవలసి ఉంటుందని గుప్తా చెప్పారు. పరిశుద్ధమైన, రుచికరమైన బాటిల్ నీటిని కేవలం 3 రూపాయలకే బాబుల్ అందిస్తుందని, ఫిల్టర్ వెలను మాత్రమే దృష్టిలో పెట్టుకున్నట్లయితే బాటిల్ నీటికి రూ.1.5లు మాత్రమే ఖర్చవుతుందని గుప్తా పేర్కొన్నారు.

ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ దాదాపుగా కాన్సర్ కారక పదార్థాలను కలిగి ఉంటున్నాయని, ఆరకంగా మనం ప్రతిరోజూ ప్లాస్టిక్ బాటిల్స్‌ లో నీటినికాకుండా కేన్సర్‌ ను తాగుతున్నామని - అది వ్యక్తుల ఆరోగ్యాన్ని - పర్యావరణాన్ని కూడా నష్టపరుస్తోందని గుప్తా తెలిపారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచంలోని 20 అత్యంత కాలుష్య కారక నగరాల్లో 13 భారతదేశంలోనే ఉన్నాయని, వీటికి ఢిల్లీ నేతృత్వం వహిస్తోందని గుప్తా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సరికొత్త బాబుల్ బాటిల్ ఇండియాలో బాగానే సేల్ అవుతుందని తయారీదారులు చక్కగానే అంచనా వేశారు మరి.
Tags:    

Similar News