రాజకీయ నాయకులు మనకు మంచో చెడో ఎపుడూ వార్తల్లో కనిపిస్తూనే ఉంటారు. కానీ ఎన్నికలు వచ్చినపుడు మాత్రమే ా కుటుంబ సభ్యులు బయట కనిపిస్తుంటారు. అన్ని ప్రముఖ కుటుంబాల్లో ఇదే పరిస్థితి. ఎన్నికల వేళ ప్రముఖుల భార్యాపిల్లలు ఎండలకు బయటకు వచ్చి ప్రచారం చేస్తుంటే... జనం తమ కష్టాలను మరిచిపోయి అయ్యో పాపం ఎంత కష్టపడుతున్నారో అని జాలి చూపేస్తారు. కానీ వారు ఎవరి కోసం కష్టపడతారు మళ్లీ ఐదేళ్లు తమ కుటుంబ సభ్యులకే పదవులు దక్కాలనే ఆరాటమే మినహా ఇంకేమీ ఉండదు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. అన్ని పార్టీల్లో ఇదే పరిస్థితి. జనానికి ప్రముఖుల కుటుంబ సభ్యులు చమట కక్కితే సులువుగా కరిగిపోతారు. పాపం వీరికి తమ జీవితాలపై జాలి ఉండదు కాని పెద్దోళ్లు ఒక్క రోజు కష్టపడినా చూడలేరు.
తాజాగా ఏపీ లో నారా కుటుంబం, నందమూరి కుటుంబం ఎన్నికలలలో తెగ తిరుగుతోంది. నందమూరి బాలకృష్ణ కూతుర్లు ఇద్దరు తమ తమ భర్తల కోసం ఎన్నికల ప్రచారంలో దిగిపోయారు. ఎలాగైనా భర్త గెలవాలని ఆరాట పడుతున్నారు. చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా 174 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించడానికి ప్రచారం చేస్తుంటే నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో తన భర్తను గెలిపించడానికి ప్రయత్నిస్తోంది. మీకు నేను ఎపుడూ ఇంటిమనిషినే. బాబుకు ఓటేయండి. మీకు సమస్య వస్తే నాకు చెప్పండి నేను చూసుకుంటాను అంటున్నారు. ఇక బాలకృష్ణ తరఫున ఆయన భార్య వసుంధర హిందూపురం నియోజకవర్గంలో బాలయ్యను గెలిపించమంటూ తిరుగుతోంది. ఇక్కడ బాలయ్య రావాలి, అక్కడ బాబు రావాలి అంటూ ప్రచారం చేస్తోంది. వీళ్లిద్దరు గత సారి కూడా ప్రచారానికి వచ్చారు.
ఇక మంగళగిరి బరిలో ఉన్న లోకేష్ను గెలిపించడానికి బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణి తెగ తిరుగుతోంది. చమటలు కక్కుతూ ఎండలో లోకేష్ కోసం తిరుగుతోంది. సాధారణ రోజుల్లో పార్టీని రాష్ట్రమంతటా చూసుకునే లోకేశ్ ఎన్నికలు వచ్చే సమయానికి తన నియోజకవర్గం గెలిస్తే అదే సూపర్ అనుకుంటూ నియోజకవర్గంలోనే ఉండిపోయారు. ఆయన నాలుగు జిల్లాల్లో ప్రచారం చేయాల్సి ఉన్నా...కేవలం రెండు జిల్లాలతో పరిమిత కార్యక్రమాలతోనే అర్ధంతరంగా ముగించుకుని మళ్లీ తన నియోజకవర్గానికి వచ్చేశారు. బ్రాహ్మణ మా ఆయన్ని గెలిపించండి అంటూ తిరుగుతోంది. చక్కటి మాటతో లోకేష్ కంటే ఎక్కువగా ఈమె ఆకట్టుకుంటోంది.
ఇక, విశాఖ నుండి సడెన్ గా ఎన్నికల బరిలో దిగిన శ్రీభరత్ గెలుపు కోసం ఆయన భార్య బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని ప్రచారంలోకి దిగారు. ఏడాది కంటే చిన్న వయసున్న బిడ్డను ఇంట్లో అప్పగించి మరీ తేజస్విని భర్త తరఫున ప్రచారం చేస్తోంది. భరత్ ను గెలిపిస్తే విశాఖ రూపు రేఖలు మరింత మారుతాయి అంటోందావిడ.
కొసమెరుపు - గత ఎన్నికల్లో బాలయ్య అల్లుళ్లు ఎన్నికల బరిలో లేరు. దీంతో ఇద్దరు కూతుళ్లు బాలయ్య తరఫున ప్రచారం చేశారు. ఇపుడు కూతుళ్ల భర్తలు పోటీ ఉండటంతో నాన్నను గెలిపించే బాధ్యతను అమ్మకు వదిలేసి తమ భర్తలు గెలిస్తే చాలు అన్నట్టు తమ తమ భర్త తఫున ప్రచారం చేసుకుంటున్నారు. తెలుగింటి ఆడిబిడ్డకు భర్తే కదా ముఖ్యం.