ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ను కొనసాగిస్తూనే ఉంది. గత మూడు రోజులుగా రష్యా బలగాలు ఉక్రెయిన్ లోని చాలా ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి. ఈ దాడిలో అనేక మంది పౌరులు చనిపోయారు. మరి కొంత మంది బంకర్లలో తల దాచుకున్నారు.
అయితే కదన రంగంలో ఉండే సైనికులు మాత్రం రష్యా దాడులకు ఏ మాత్రం బెదరడం లేదు. యుద్ధ భూమిలో చావో రేవో అని ముందుకు దూసుకుపోతున్నారు.
నమ్మిన చాలా దేశాలు ఇప్పటికే ఉక్రెయిన్ను ఒంటరిని చేసినా కానీ ఆ దేశాధ్యక్షుడు ఇచ్చిన స్ఫూర్తి తో సేనలు ముందడుగు వేస్తున్నాయి. మరి కొంత మంది సైనికులు అయితే రష్యా సైన్యాన్ని నిలువరించేందుకు ఆత్మాహుతి కి పాల్పడుతున్నారు. కొందరు తమ వద్ద ఉన్న సాధారణ ఆయుధాలతో నెగ్గుకు వస్తున్నారు.
ఇదిలా ఉంటే ఉక్రెయిన్ దగ్గర ఉండే ఆయుధ సంపత్తి అంతా గతంలో కంటే ఎక్కువగా ఉన్నా సరే.. నేడు రష్యాతో పోల్చితే అంతంత మాత్రంగానే ఉంది. రష్యా దగ్గర ఉన్న ఆయుధ సామాగ్రి ఉక్రెయిన్ ను ఇప్పటికే తమ వశం చేసుకోవచ్చు. కానీ అది వారికి అంత సులువు కాదు. ఇందుకు ప్రధాన కారణం ఉక్రెయిన్ దగ్గర ఉండే కొన్ని ఆయుధాలు చాలా బలమైనవి. వాటిలో ముఖ్యమైంది సెయిండ్ జావెలిన్.
ప్రస్తుతం ఇది ఉక్రెయిన్ సైనికుల చేతిలో కీలక ఆయుధంగా మారింది. ఇది చూసేందుకు చాలా చిన్నగా ఉన్న కానీ దీని పవర్ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. ఈ చిన్న పాటి ఆయుధంతో రష్యా సేనలను ఉక్రెయిన్ సైనికులు అడ్డుకుంటున్నారు.
ఎందుకంటే ఇది చిన్న పాటి మిసైల్ లాంచర్ లాంటిది. దీనితోనే కొన్ని కీలక ప్రాంతాల్లో రష్యా సైనికులను మట్టి కనిపిస్తున్నారు ఉక్రెయిన్ సైనికులు. అంతేగాకుండా రష్యాకు చెందిన కొన్ని యుద్ధ విమానాలను, యుద్ధ ట్యాంకులను కూడా వీటి సాయంతో పేల్చుతున్నారు.
ఈ జావెలిన్ గురించి చాలా మందికి తెలియదు. దీనిని మొదటగా రూపొందించింది అమెరికా. ఆ దేశంలో రక్షణ శాఖ దీనిని తొలుత తయారు చేసింది. దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. దీనిని ఎక్కడకు అయిన తీసుకుని వెళ్లవచ్చు. బరువు తక్కువ ఉంటుంది. తేలికగా ఎటువంటి ప్రదేశాలకు అయిన క్యారీ చేసేలా ఉంటుంది. దీనిని కేవలం ట్రిగర్ సాయం తో పేల్చవచ్చు.
సాధారణంగా మిసైల్స్ కు అవసరం అయిన లాంచర్ అనేది దీనికి అవసరం లేదు. దీని బరువు కూడా సుమారు 50 పౌండ్లు కంటే తక్కువగా ఉంటుంది. దీనిని ఉపయోగించిన తరువాత ప్రయోగించిన వ్యక్తి ఆ చోటు నుంచి మరో చోటుకు సులభంగా స్థానభ్రంశం చేసి ఈజీగా దాక్కోవచ్చు. అందుకే దీనిని మినీ మిస్సైల్ అంటారు. ప్రస్తుతం రష్యా సేనలు ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ సైనికులు దీనిని ఉపయోగిస్తున్నారు.