అన్ని అవయవాల పని తీరును నియంత్రించేంది, నిర్వహించేది మెదడు. మరి ఈ మెదడులో అలజడి రేగితే శరీరం మొత్తం అస్తవ్యస్తం అవుతుంది. ఇక మెదడులో కణితి(ట్యూమర్) ఏర్పడితే ఎవరికైనా ఆందోళన సహజమే. మెదడులో వచ్చే కణితులు ప్రమాదకరం. కానీ అన్నీ క్యాన్సర్ కానవసరం లేదు. అందుకే వీటి పట్ల అవగాహన కలిగి..మొదట్లోనే గుర్తిస్తే కణితులను పూర్తిగా నయం చేయొచ్చు. నేడు వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా బ్రెయిన్ ట్యూమర్పై ప్రత్యేక కథనం..
మానవ శరీరంలో గుండె తర్వాత అత్యంత కీలక అవయం మెదడు. శరీర నిర్మాణం మొత్తం నడిచేది మెదడు నుంచే. అలాంటి మెదడులో అలజడి రేగితే శరీరం మొత్తం స్తంభించిపోతుంది. మెదడులో ఏర్పడే కణితులు చాలా ప్రమాదకరం. వీటిని త్వరగా గుర్తించి చికిత్స తీసుకోకపోతే ప్రమాదాలు పోయే ముప్పు ఉంది. ప్రజలకు ఈ కణితులపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ఏటా జూన్ 8న వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా బ్రెయిన్ ట్యూమర్పై ప్రత్యేక కథనం.
ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుత అంచనాల ప్రకారం ప్రతి లక్ష మందిలో ఏడుగురు బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నారు. అంటే జిల్లాలో 350 మంది వరకు ఈ వ్యాధి సోకిన వారున్నారని అంచనా. 20 ఏళ్ల క్రితం ఈ జిల్లాలో ఒకే ఒక్క న్యూరోసర్జన్ డాక్టర్ సీతారామ్ ఉండేవారు. మెదడు, కేంద్రనాడీ మండలానికి వచ్చే వ్యాధులకు ఆయనే చికిత్స చేసేవారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆయన వద్ద చికిత్స తీసుకునేందుకు రాయలసీమ జిల్లాలన్నింటితో పాటు తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా రోగులు క్యూ కట్టేవారు.
కానీ కాలం మారింది. దేశంలో వైద్య విద్యనభ్యసించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఫలితంగా వైద్యకళాశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు పెరిగాయి. న్యూరోసర్జన్ల కొరత కూడా తీరింది. ఇప్పుడు ప్రతి విభాగానికి పది మందికిపైగా స్పెషాలిటీ వైద్యులు ఉన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్య శాలలోనే ఐదుగురు న్యూరోసర్జన్లు ఉన్నారు. ప్రైవేటుగా మరో 10 మంది వైద్యులున్నారు. అంతే సంఖ్యలో న్యూరో ఫిజీషియన్లు కూడా సేవలందిస్తున్నారు. బ్రెయిన్ట్యూమర్ రోగులంతా వీరి వద్దకు క్యూ కడుతున్నారు. బ్రెయిన్ ట్యూమర్ వంటి వ్యాధులకు శస్త్ర చికిత్సలను కర్నూలు జిల్లాలో సర్వజన వైద్య శాలతో పాటు నాలుగైదు ఆస్పత్రుల్లో మాత్రమే నిర్వహిస్తున్నారు.
అసలు కణితి అంటే ఏంటంటే.. మెదడులోని కణజాలాల్లో ఏర్పడే ముద్దను మెదడు కణితి అంటారు. ఇవి రెండు రకాలు. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్, సెకండరీ బ్రెయిన్ ట్యూమర్. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్‌ను నాలుగు విభాగాలుగా విభజించారు. సెకండరీ బ్రెయిన్ ట్యూమర్లు శరీరంలో వివిధ భాగాల్లో సోకుతాయి. అవి రక్తంలో ప్రవేశించి మెదడుకు చేరతాయి. దీని ద్వారా మెదడులో కణితులు ఏర్పడతాయి. కొన్ని రసాయనాల బారిన పడటం, రేడియేషన్ ఎక్కువగా ఉండటం, ఎక్స్‌టీమ్ వైరస్ బారిన పడటం వల్ల ఈ కణితులు ఏర్పడతాయని వైద్యులు చెబుతున్నారు.
తలనొప్పి, వాంతులు, చూపు మందగించడం, ఒత్తిడి పెరగడం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు మెదడులో కణితి ఏర్పడిందని చెప్పే జనరల్ లక్షణాలు. ఇక కొన్ని ప్రత్యేక లక్షణాలు మాత్రం మెదడులో కణితి ఏర్పడిన స్థానం బట్టి కనిపిస్తాయి. మెదడు ముందు, మధ్య, వెనుక భాగంలో ఆయా స్థానాల్లో ఏర్పడిన కణితులను బట్టి లక్షణాలుఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మాట తడబడటం, చూపు మసకగా కనిపించడం, చెవులు సరిగ్గా వినిపించకపోవడం, మూతి వంకర పోవడం, ఫిట్స్ రావడం, పక్షవాతం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. ప్రతి తలనొప్పి మెదడులో కణితి ఏర్పడిందని చెప్పే లక్షణం కాకపోవచ్చు. కానీ తీవ్రంగా తలనొప్పి రోజుల తరబడి బాధిస్తే మాత్రం తప్పనిసరిగా స్కానింగ్ తీయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
మెదడులో కణితులు ఉన్నాయా లేవో తెలుసుకోవాలంటే మూడు రకాల పరీక్షలు చేయించుకోవాలి. మొదటిది క్లినికల్, రేడియోలజీ, సర్జికల్. సిటీ స్కాన్, ఎంఆర్ స్కాన్లో కణితి ఏర్పడిందో లేదో తెలిసిపోతుంది. కానీ కొందరిలో మాత్రం సర్జికల్ ద్వారానే అసలు విషయం బయటపడుతుంది. అయితే మెదడులో ఏర్పడిన కణితి బట్టి చికిత్స ఇస్తారు.
మెదడులో ఏర్పడిన కణితులను గ్రేడ్ 1, 2,3, 4 గా విభజించి చికిత్స అందిస్తాం. అలాగే కణితుల స్థానంపై కూడా ఆధారపడి చికిత్స ఉంటుంది. గ్రేడ్ 1,2లలో ఉన్న కణితులు మూడు సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటే రేడియేషన్ ద్వారా తగ్గించవచ్చు. దీని ద్వారా వారి సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చు. అయితే గ్రేడ్ 3,4 కణితులు ఉంటే జీవించే అవకాశం తక్కువగా ఉంటుంది. రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ వంటి అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉన్నాయి. ఈ కణితులను త్వరగా గుర్తించి చికిత్స అందిస్తే మంచింది. అని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల న్యూరో సర్జన్ డాక్టర్ సుమంత్ కుమార్ తెలిపారు.